![]() |
![]() |

క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కోసం గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) రంగంలోకి దిగుతున్నాడు. 'భగవంత్ కేసరి'లో తన సరసన డా. కాత్యాయనిగా అలరించిన కాజల్ కోసం చిచ్చా ఎంటరవుతున్నాడు. కాజల్ కొత్త సినిమాపై ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెరిగేలా చేయడం కోసం.. తన వంతు సాయం చేయడానికి బాలయ్య ముందుకొస్తున్నాడు.
కాజల్ టైటిల్ రోల్ పోషిస్తున్న తాజా చిత్రం 'సత్యభామ' (Satyabhama). సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. మే 24న ట్రైలర్ విడుదల కానుంది. హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ లో శుక్రవారం సాయంత్రం జరగనున్న ఈ వేడుకకు బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నాడు. ఆయన చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కానుంది. 'భగవంత్ కేసరి' సమయంలో బాలకృష్ణ, కాజల్ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆ అనుబంధంతోనే ట్రైలర్ లంచ్ ఈవెంట్ కు ఆయన వస్తున్నట్లు సమాచారం. మరి బాలకృష్ణుడి రాక 'సత్యభామ'కు కలిసొస్తుందేమో చూడాలి.

'మేజర్' దర్శకుడు శశి కిరణ్ తిక్క సమర్పణలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా 'సత్యభామ' చిత్రంలో నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్ష వర్ధన్, రవి వర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
![]() |
![]() |