![]() |
![]() |

అవును... బాలకృష్ణ కాశీ వెళతారు! ఈ నెలాఖరున వారణాసి వెళ్ళడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఆయన వెళ్తున్నది వ్యక్తిగత పనుల కోసం కాదు. సినిమా కోసమే! బాలకృష్ణ కథానాయకుడిగా 'సింహ', 'లెజెండ్' వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన దర్శకుడు బోయపాటి శ్రీను... మెచ్చిన హీరో తో ముచ్చటగా మూడో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం కాశీ వెళ్లనున్నారు. ఫిబ్రవరి 26న నుండి కాశీలో షెడ్యూల్ స్టార్ట్ కానుంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యట్రిక్ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే సమయంలో ఇందులో బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపించనున్నారనే వార్త ఆ అంచనాలను మరింత పెంచింది. దీనికి తోడు బాలకృష్ణ కొత్త లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తుంది. ఎన్టీఆర్ బయోపిక్ తో, రూలర్ సినిమాతో అభిమానుల అంచనాలను చేరుకోవడంలో కాస్త వెనుకపడిన బాలయ్య... ఈ సినిమాతో భారీ హిట్ కొట్టడం ఖాయమని నందమూరి అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. బోయపాటి కుటుంబంలో విషాదం చోటు చేసుకోవడంతో కొంత ఆలస్యమైంది. సినిమా లేట్ అయినా లేటెస్ట్ గా వస్తారని యూనిట్ చెబుతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
![]() |
![]() |