![]() |
![]() |
![]()
అవతార్ పార్ట్ 1(Avathar part 1)తో ప్రపంచ సినీ ప్రేమికులకి సరికొత్త లోకాన్నిపరిచయం చేసిన ప్రపంచ సినీ పితామహుడు జేమ్స్ కామెరూన్(James Cameron)పండోర అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలని కళ్ళకి కట్టినట్టుగా చూపించాడు.ఆ తర్వాత 'అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్' లో సముద్రంలో జరిగే పోరాటం చూపించాడు.ఇప్పుడు అవతార పార్ట్ 3 ఫైర్ అండ్ యాష్(Avatar3 fire and ash)అగ్నికి సంబంధించిన నేపథ్యంలో తెరకెక్కుతుంది.
రీసెంట్ గా ఒక సినిమా కార్న్ లో పాల్గొన్న దర్శకుడు కామెరూన్ అవతార్ 3 కి సంబంధించిన పలు విషయాలని ప్రేక్షకులతో పంచుకోవడం జరిగింది.ఆయన మాట్లాడుతు ఇప్పటి వరకు తెరకెక్కిన రెండు చిత్రాలకంటే పార్ట్ 3 భిన్నంగా ఉంటుంది.తొలి రెండు భాగాల్లో'జేక్' కుటుంబం మానవ ప్రపంచంతో పోరాటం చేసింది.కానీ ఇప్పుడు మూడో పార్ట్ లో సరికొత్త విలన్స్ పుట్టుకొస్తున్నాయి.యాష్ ప్రపంచంలోని తెగలతో జేక్ కుటుంబం పోరాటం చేయబోతుంది.మొదటి పార్ట్ లో భూమి,రెండో పార్ట్ లో సముద్రం,మూడో పార్ట్ లో చంద్రుడి పై జరిగే యుద్దాన్ని చూడబోతున్నారు.తప్పకుండా అవతార్ పార్ట్ 3 ప్రేక్షకులని అలరిస్తుందని చెప్పుకొచ్చాడు.
జేమ్స్ కామెరూన్ మాట్లాడిన ఈ మాటలతో అవతార్ 3 ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి అడుగుపెడుతుందా అని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు.2025 డిసెంబర్ 19 న మూడో పార్ట్ విడుదల కానుంది.అవతార్ 4 ,5 పార్టులు కూడా ఉండగా 2029 ,2031 లో విడుదల కానున్నాయి.ఈ మేరకు మేకర్స్ అధికారకంగా చాలా రోజుల క్రితమే ప్రకటించారు.

![]() |
![]() |