Home  »  News  »  త్వరలో కొత్త సీరియల్ అమ్మోరు..బ్రహ్మముడి శ్రీప్రియ కూతురు లాంఛ్

Updated : Feb 10, 2026

 


ఈటీవీలో త్వరలో అమ్మోరు అనే కొత్త సీరియల్ ప్రసారం కాబోతోంది. ఇక ఈ సీరియల్ లో కల్కి, చరిష్మా నటిస్తున్నారు. వీళ్ళతో ఒక చిట్ చాట్ ఇంటర్వ్యూ చేశారు. ఈ చిట్ చాట్ లో చాలా విషయాలు చెప్పారు ఇద్దరూ. "హలో అండి నా పేరు క‌ల్కి రాజా. పాశర్లపూడి  నా విలేజ్.  నేను అమలాపురం కుర్రోడిని" అని చెప్పాడు. "నా పేరు చరిష్మా శ్రీకర్. తెలుగు అమ్మాయినే. నేను  పుట్టింది హైదరాబాద్. కానీ మా పేరెంట్స్ వాళ్ళది ఆంధ్రా, విజయవాడ, గుంటూరు ఆ  సైడ్ నుంచి వచ్చారు.  మా మదర్ ఫాదర్ కూడా ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు. మా అమ్మ  శ్రీప్రియ. ఆమె కూడా నటి.  మీరెన్నో సీరియల్ లో చూసుంటారు. డాడీ కూడా స్క్రీన్ ప్లే  రైటర్ అండ్ డైరెక్టర్ కూడా. చిన్నప్పటి నుంచి ఇదే బ్యాక్‌గ్రౌండ్‌లో  పెరగడం వల్ల నాకు కూడా దీని మీద ఇంటరెస్ట్ కలిగింది. నేను ఇంతకుముందు మూవీస్ చేశాను. ఇప్పుడు అమ్మోరు సీరియల్ ద్వారా  లాంచ్ అవుతున్నాను" అని చెప్పింది. "అమ్మోరు సీరియల్ ని సెలెక్ట్  చేసుకోవడానికి రీజన్ ఏంటి ?" అని హోస్ట్ అడిగింది. "మొదటి రోజు షూట్ కి వెళ్ళినప్పుడు నాకే అనిపించింది. ప్రతీ చిన్న పాయింట్ ని కూడా మిస్ కాకుండా చూసుకుంటున్నారు. 


నా బాడీ మీద ఉన్న టాటూస్ దగ్గర నుంచి అన్ని విషయాల గురించి శ్యాం ప్రసాద్ రెడ్డి గారి అప్రూవల్   తీసుకుని ఆయన ఓకే అన్న తర్వాత షూట్ చేస్తున్నారు. అందుకే ఈ సీరియల్ నేనే నేనే చేయాలి అనుకున్నారు. టీజర్ లాంఛ్ అయిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది" అని చెప్పాడు. "నేను అమ్మోరు సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే నేను మూవీస్ చేస్తున్నాను. నాకు ఫస్ట్ నుంచి మూవీస్ మీద ఇంటరెస్ట్ ఉంది. మూవీస్ చేస్తూ ఉంటే మమ్మీ, డాడీ  సర్కిల్ అంతా ఈ టెలివిజన్ ఇండస్ట్రీలో ఉండడం వల్ల అప్పుడప్పుడు నన్ను సీరియల్స్ చేయమని  అడిగారు నన్ను. నాకు మూవీ సైడే ఇంట్రెస్ట్ ఉండేసరికి సీరియల్స్ ఎందుకు అని చెప్పేసి చాలా రోజులు ఆపుకుంటూ వచ్చాను. బట్ ఈ అమ్మోరు ప్రాజెక్ట్ మల్లెమాల నుంచి నా కాల్ వచ్చినప్పుడు ఐ థింక్ ఐ హావ్ నో అదర్ రీజన్ అంటే నో చెప్పడానికి అసలు రీజన్ అనేది దొరకలేదు. ఫస్ట్ ఈటీవీ తర్వాత లెజెండరీ మూవీ అమ్మోరు అనేది. దాంట్లో ఆ ప్రాజెక్ట్ ద్వారా నేను లాంచ్ అవడం అనేది అదృష్టం అనుకోని నేను ఈ సీరియల్ చేయడానికి ఒప్పేసుకున్న" అని చెప్పింది. "అమ్మోరు సీరియల్ షూట్ లో మీరు ఫస్ట్ చేసిన కెమెరా సీన్ ఏంటి " అని అడిగింది హోస్ట్. " ఫస్ట్ సీనే  భయంకరంగా ఉంది. పెద్ద ముగ్గేశారు పుర్రె పెట్టారు.  ఆ లుక్   ట్రాన్స్‌ఫర్మేషన్ కి నాకు 12 గంటలు పట్టింది.  ఆ గెటప్ లో టచప్ చేసుకోవాలి అన్నా కూడా భయం వేసింది" అని చెప్పాడు. 

"నాకు నా ఫస్ట్ సీన్ వచ్చేసి చాలా నీట్ గా క్యూట్ గా ఉండే ఇంట్రడక్షన్ . అమ్మవారికి పూజ చేయడం ఇలా జరిగింది. పాజిటివ్ గా చాలా బాగుంది. కానీ ఈ సీరియల్ లో ఇప్పటి వరకు అంటే చేసిన వర్కింగ్ డేస్ తక్కువైనా కానీ వింటర్ లో అభిషేకాలు, వాటర్ పోయడము, చలి, నైట్ కాల్ షీట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇందులో ఒక  ఫైట్ సీక్వెన్స్ ఉంది. టెలికాస్ట్ అప్పుడు మిస్ అవ్వకుండా చూడండి." అని చెప్పింది. చరిష్మా ఎవరో కాదు బ్రహ్మముడి సీరియల్ అపర్ణ దేవి రోల్ లో నటిస్తున్న శ్రీప్రియ శ్రీకర్ కూతురు. ఈ అమ్మోరు  సీరియల్ ఈ ఫిబ్రవరి 16  నుంచి ఆ రాత్రి 7:30 నిమిషాలకి నుంచి ప్రసారం కాబోతోంది. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.