Home  »  News  »  Allu Arjun: పవన్ కళ్యాణ్‌ని కలిసిన అల్లు అర్జున్.. సీక్రెట్ మీటింగ్ వెనుక అసలు కథ ఇదేనా?

Updated : Jun 11, 2026

 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun).. తెలుగు సినీ పరిశ్రమకి దొరికిన అరుదైన హీరోలు.. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ ఇద్దరి సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వర్షంతో తడిసి ముద్దవుతుంది. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో ఇప్పుడు ఒక వార్త  హల్‌చల్ చేస్తోంది. 


పవన్ కల్యాణ్‌కి ఇటీవల ఒక సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సర్జరీ తర్వాత డాక్టర్లు ఆయనకి దాదాపు 7 రోజుల పాటు పూర్తి బెడ్ రెస్ట్ అవసరమని సూచించారు. వైద్యుల సలహా మేరకు గత కొన్ని రోజులుగా తన ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కల్యాణ్, ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటున్నారు. చాలా ముఖ్యమైన ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు ఉంటే తప్పితే  బయటకు రావడం లేదు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి, ఆయనని  స్వయంగా పరామర్శించడానికి అల్లు అర్జున్ నిన్న రాత్రి పవన్ నివాసానికి వెళ్లారు. అక్కడ పవన్ హెల్త్ కండిషన్‌తో పాటు పలు వ్యక్తిగత, ఫ్యామిలీ విషయాల గురించి కూడా వీరిద్దరూ దాదాపు గంటకు పైగా సుదీర్ఘంగా చర్చించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.


Also read: Peddi: ఓటిటి డేట్ పై ఇంట్రెస్టింగ్ బజ్.. ఫస్ట్ వీక్ రికార్డు కలెక్షన్స్  

సాధారణంగా అల్లు అర్జున్ చేసే ప్రతి చిన్న పనిలోను  లేదా పర్యటనలోనూ భారీగా పబ్లిసిటీ కనిపిస్తుంది. కానీ ఈసారి పవన్  ఇంటికి బన్నీ అత్యంత సీక్రెట్‌గా, ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లారు. అలా వెళ్లడం వెనుక ఒక బలమైన వ్యూహం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ పరామర్శని  కేవలం ఒక కుటుంబ సభ్యుడిగా మాత్రమే ఉంచాలని, దీనికి ఎలాంటి రాజకీయ రంగు, పబ్లిసిటీ స్టంట్ అనే ముద్ర పడకూడదని బన్నీ భావించారట. అందుకే ఈ మీటింగ్‌కి   సంబంధించిన ఎలాంటి ఫొటోలు గానీ, కనీసం ఒక్క వీడియో క్లిప్ కూడా బయటకి రాలేదు. గతంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన ఒక ప్రమాదం నుండి కోలుకున్నప్పుడు కూడా బన్నీ ఇలాగే పరామర్శించారు. ఈ కలయిక మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య ఉన్న విభేదాలకి  100 శాతం ఎండ్ కార్డ్ పడినట్లే అని  ఇరువర్గాల పెద్దలు ఆశిస్తున్నారు. 

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.