![]() |
![]() |

సంధ్య థియేటర్ కి సంబంధించి రేవతి(revathi)చనిపోయిన ఘటనలో బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్(allu arjun)ని హైకోర్టు సూచనతో హైదరాబాద్ లోని చిక్కడ పల్లి పోలీసులు ఈ రోజు విచారించడం జరిగింది. విచారణలో అల్లు అర్జున్ నుంచి పోలీసులు పలు ప్రశ్నలకి సమాధానాలు రాబట్టగా,మరికొన్ని ప్రశ్నలకి జవాబు చెప్పకుండా మౌనంగా ఉన్నట్టుగా తెలుస్తుంది.మూడు గంటల విచారణాంతరం అల్లు అర్జున్ పోలీసు స్టేషన్ నుంచి వెళ్లిపోవడం జరిగింది.
రీసెంట్ గా జూబ్లీహిల్స్ లోని అల్లుఅర్జున్ నివాసం చుట్టూ తెల్లటి పరదాలు కట్టారు.దీంతో లోపల ఉన్నవాళ్లు ఎవరు కూడా బయటకి కనపడరు.కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ ఇంటి ముందు రేవతి విషయంలో కొంత మంది సమ్మె చేస్తూ ఆ తర్వాత అల్లు అర్జున్ ఇంట్లోకి టమాటాలు విసిరి, పూల కుండీలని ధ్వంసం చేసిన నేపథ్యంలో మళ్ళీ అలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పరదాలు కట్టినట్టుగా తెలుస్తుంది.
![]() |
![]() |