![]() |
![]() |

`మళ్ళీ రావా` చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన గౌతమ్ తిన్ననూరి.. రెండో సినిమా `జెర్సీ`తో ఎనలేని గుర్తింపుని తెచ్చుకున్నాడు. త్వరలో ఈ టాలెంటెడ్ కెప్టెన్ బాలీవుడ్ లో `జెర్సీ` రీమేక్ తో సందడి చేయనున్నాడు. దీపావళికి ఈ స్పోర్ట్స్ డ్రామా థియేటర్స్ లోకి రానుంది.
ఇదిలా ఉంటే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో గౌతమ్ తిన్ననూరి ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాదు.. గౌతమ్ గత చిత్రాలకు భిన్నంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని బజ్. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఇదో యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలిసింది. బన్నీ ఇమేజ్ కి తగ్గట్టుగా స్క్రిప్ట్ ని సిద్ధం చేసినట్లు వినికిడి. త్వరలోనే బన్నీ, గౌతమ్ కాంబినేషన్ మూవీపై క్లారిటీ రానుంది.
కాగా, అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప`తో బిజీగా ఉన్నారు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ పాన్ - ఇండియా మూవీ.. రెండు భాగాలుగా రాబోతోంది. తొలి భాగాన్ని ఈ ఏడాది క్రిస్మస్ కి.. మలి భాగాన్ని 2022 వేసవికి విడుదల చేయబోతున్నట్లు బజ్. ఇక గౌతమ్ కూడా బన్నీ కాంబినేషన్ మూవీ సెట్స్ పైకి వెళ్ళే లోపే నేచురల్ స్టార్ నానితో `జెర్సీ` తరహాలో మరో స్పోర్ట్స్ డ్రామా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
![]() |
![]() |