Home

»

Latest News

ధ‌నుష్‌తో విడిపోయాక మ్యూజిక్ వీడియో ప‌నిలో ఐశ్వ‌ర్య‌!

Jan 25, 2022 11:19AM

 

ప‌ద్దెనిమిది సంవ‌త్స‌రాల వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టి విడిపోయారు ధ‌నుష్‌, ఐశ్వ‌ర్యా ర‌జ‌నీకాంత్‌. ఇద్ద‌రూ త‌మ సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసిన ఒక సుదీర్ఘ లేఖ‌లో తాము భార్యాభ‌ర్త‌లుగా విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు వెల్ల‌డించారు. ధ‌నుష్‌తో తెగ‌తెంపులు చేసుకున్న కొద్ది రోజుల‌కే త‌న ప‌నిలోకి దిగిపోయింది ఐశ్వ‌ర్యా ర‌జ‌నీకాంత్‌.

ప్ర‌స్తుతం ఆమె త‌న మ్యూజిక్ వీడియోకు సంబంధించిన ప్రి-ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ నిమిత్తం హైద‌రాబాద్‌లో ఉంది. ఆ వీడియోకు ప‌నిచేసే యాక్ట‌ర్లు, టెక్నీషియ‌న్ల‌కు ఫైన‌లైజ్ చేసే ప‌నిలో ఉందామె. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేంటే ధ‌నుష్ సైతం హైద‌రాబాద్‌లోనే ఉన్నాడు. 'సార్' (త‌మిళంలో 'వాతి') సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అందిన స‌మాచారం ప్ర‌కారం ఆ ఇద్ద‌రూ బ‌స చేసింది ఒకే హోట‌ల్‌లోనే!

Also read: స‌ల్మాన్ ఫామ్‌హౌస్‌లో ఫిల్మ్ స్టార్ల శ‌వాల‌ను పాతిపెట్టారా?

టీమ్‌తో క‌లిసి చ‌ర్చ‌లు జ‌రుపుతున్న ఐశ్వ‌ర్య ఫొటోను షేర్ చేసిన‌ మ్యూజిక్ వీడియో ప్రొడ‌క్ష‌న్ హౌస్‌, "త‌న మ్యూజిక్ వీడియో కోసం ఐశ్వ‌ర్యా ర‌జ‌నీకాంత్ ప్రిప‌రేష‌న్ వ‌ర్క్ స్టార్ట్ చేశారు. హైద‌రాబాద్‌లో ఆ వ‌ర్క్ ఫుల్ స్వింగ్‌లో జ‌రుగుతోంది. ఐశ్వ‌ర్య డైరెక్ట్ చేస్తున్న ఈ మ్యూజిక్ వీడియోను కుమార్ తౌరాని, ప్రేర‌ణా అరోరా, బే ఫిలిమ్స్ క‌లిసి నిర్మిస్తున్నారు. వేలంటైన్స్ డేకి ఇది రిలీజ‌వుతుంది" అని పోస్ట్ చేసింది. 

Also read: 'అఖండ‌'లో మెయిన్ విల‌న్ రియ‌ల్ లైఫ్‌లో మాజీ ఆర్మీ ఆఫీస‌ర్ అని మీకు తెలుసా?

ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య 2004 న‌వంబ‌ర్ 18న పెళ్లి చేసుకున్నారు. వారికి 2006లో యాత్ర‌, 2010లో లింగా అనే ఇద్ద‌రు కొడుకులు పుట్టారు. ప్ర‌స్తుతం ఆ ఇద్ద‌రూ త‌ల్లి ద‌గ్గ‌రే ఉన్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com