Home  »  News  »  Nayanthara: నయనతారపై ప్రముఖ ఎంపి కీలక వ్యాఖ్యలు.. కలవాలని ఉంటే కోరిక నెరవేరుస్తారా! 

Updated : Mar 18, 2026

 

-వైరల్ గా మారిన ఎంపి వ్యాఖ్యలు 
-ఎందుకు ఆ విధంగా మాట్లాడాడు
-నయనతార రిప్లై కోసం వెయిటింగ్
 
 
నయనతార(Nayanthara).. బడా హీరోల దగ్గరకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ వెళ్లి తమతో సినిమా ఒప్పించాక సదరు బడా హీరోల నోటి నుంచే వినపడే మాట నయనతర. ముందు నయనతార డేట్స్ తీసుకోండి. మూవీ స్టార్ట్ చేద్దామని అంటారు. రెండున్నర దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉంటు నయనతార ఆ ఘనతని అందుకుంటు ఉందంటే హీరోయిన్ కట్ అవుట్ కి ఆమె తెచ్చిన గుర్తింపుని అర్ధం చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ చోటా హీరోల ఛాయస్ కూడా ఉందనుకోండి. రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారుని శశిరేఖగా తన స్టయిల్లో ముడు చెరువుల నీళ్లు తాగించిన నయనతార గురించి తమిళ పొలిటికల్ లీడర్ చేసిన వ్యాఖ్యలు అభిమానులని బాధపెడుతున్నాయి. ఆ మాటలేంటో చూద్దాం.

దశాబ్దాల చరిత్ర కలిగిన పొలిటికల్ పార్టీగా 'అన్నాడీఎంకే'(aiadmk)కి తమిళ ప్రజల్లో ఎంతో ఆదరణ ఉంది. నిన్న అధికార డిఎంకే పార్టీపై వ్యతిరేఖని వ్యక్తం చేస్తు ఒక నిరసన కార్యక్రమం చేపట్టింది. డిఎంకే ప్రభుత్వంలో మహిళలకి భద్రత లేకుండా పోయిందనేది నిరసన కార్యక్రమం యొక్క ప్రధాన కాన్సెప్ట్. ఈ సందర్భంగా  అన్నాడీఎంకే రాజ్యసభ ఎంపీ సీవే షణ్ముగం మాట్లాడుతు అబ్దుల్ కలాం కలలు కనమన్నారు. సీఎం స్టాలిన్ కూడా మన కలలని పంచుకోమంటున్నారు. నాకు నయనతారని కలవాలని ఉంది. ఎవరైనా    నయనతారతో పెళ్లి చేయమని అడిగితే ఆ కలను స్టాలిన్  నెరవేరుస్తారా! అని మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఈ మాటలు తమిళనాట హై ప్రోటీన్ హీట్ ని కలిగిస్తున్నాయి.


Also read: Dhurandhar 2: ఎందుకు ఈ వివక్ష.. అక్కడ ఒకలా, ఇండియాలో ఒకలా ఎందుకు 


మరి ఇచ్చింది ఉంచుకోకుండా తిరిగి ఇవ్వడంలో మాస్టర్ డిగ్రీ చేసిన నయనతార సదరు ఎంపీ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తుందో అనే ఆసక్తి అందరిలో ఉంది. అభిమానులైతే సోషల్ మీడియా వేదికగా ఎంపీ తీరుపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. తమిళ కళాకారుల సంక్షేమం కోసం ఏర్పడిన నడిగర్ సంఘం కూడా ఈ విషయంపై ఘాటుగానే స్పందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 

 



 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.