![]() |
![]() |

గత కొద్దిరోజులుగా భారత్ లో కరోనా విజృంభణ మళ్ళీ కొనసాగుతోంది. ముఖ్యంగా సినీ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. బాహుబలి సినిమాతో కట్టప్పగా అందరికీ దగ్గరైన కోలీవుడ్ సీనియర్ నటుడు సత్యరాజ్ కరోనా బారిన పడ్డారు. అంతేకాదు ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
ఇటీవల కోవిడ్ పరీక్షలు చేయించుకోగా సత్యరాజ్ కు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దాంతో ఆయన అప్పటి నుంచి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే గత రాత్రి ఆయన పరిస్థితి విషమంగా మారడంతో ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సత్యరాజ్ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యంపై అధికారిక అప్ డేట్ రావాల్సి ఉంది.
సత్యరాజ్ త్వరగా కోలుకొని క్షేమంగా తిరిగి రావాలని సినీ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు.
![]() |
![]() |