Home  »  News  »  4వ అధ్యాయం మూవీ రివ్యూ

Updated : Apr 5, 2026

నటీనటులు: అమ్ము అభిరామి, వెట్రి, సాక్షి అగర్వాల్, దువ్య దురై సామి తదితరులు
ఎడిటింగ్:  రామచంద్ర
సినిమాటోగ్రఫీ: భరణి
మ్యూజిక్: రిహానా
నిర్మాతలు: రాజశేఖర్ అన్నభీమోజు
దర్శకత్వం: కామరాజ్ వేల్
ఓటీటీ : ఆహా

కథ: 

'4వ అధ్యాయం' అనేది నాలుగు భిన్నమైన కథల సమాహారం. ఈ నాలుగు కథలు కూడా వేర్వేరు నేపథ్యాల్లో సాగుతాయి. మొదటి కథలో ఒక నర్సు మరియు ఒక సీరియల్ కిల్లర్ లేదా గ్యాంగ్‌స్టర్ మధ్య జరిగే సంఘర్షణ చుట్టూ తిరుగుతుంది. ఒక ప్రమాదకరమైన వ్యక్తిని కాపాడాల్సి వచ్చినప్పుడు ఆ నర్సు ఎదుర్కొన్న సవాళ్లు ఇందులో కనిపిస్తాయి. రెండో కథలో ప్రస్తుత కాలంలో యువతను పట్టి పీడిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ మరియు గేమింగ్ వ్యసనంపై సాగుతుంది. ఈ వ్యసనం వల్ల ఒక యువకుడి జీవితం ఎలా మలుపు తిరిగిందనేది ప్రధానాంశం. ఇక మూడో కథలో  సమాజంలోని పేదరికం, ఆకలి మరియు ఒక సామాన్యుడు తన మనుగడ కోసం చేసే పోరాటాన్ని చూపిస్తుంది. నాలుగో కథలో మానవ సంబంధాలు మరియు భావోద్వేగాల చుట్టూ సాగుతుంటుంది.

విశ్లేషణ: 

దర్శకుడు కామరాజ్ వేల్ ఎంచుకున్న పాయింట్లు బాగున్నాయి. సామాజిక సమస్యలను అంతాలజీ రూపంలో చెప్పాలనుకోవడం మంచి ప్రయత్నం. అయితే, నాలుగు కథలను ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా తీసాడు. వాటిని కలుపుతూ  ఎండింగ్ చేస్తే మరింత బాగుండేది. ఇక మొదటి కథలో సస్పెన్స్ ఒకే కానీ రెండు మూడు కథలు కొంచెం సాగదీసినట్లుగా అనిపిస్తాయి.

ప్రతీ కథలోనూ పాత్రల చిత్రీకరణ వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది‌. నాలుగో కథ కాస్త చూసే విధంగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది.  మ్యూజిక్ విషయానికొస్తే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని కీలక సన్నివేశాల్లో తేలిపోయింది పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే సినిమా మరింత కథ ఇంకా వేగంగా సాగేది దాంతో ఆడియన్స్ ని ఎంగేజింగ్ గా చేసేది. 

ప్లస్ పాయింట్స్: 

నటీనటుల సహజ నటన. 
ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సాగే సందేశాత్మక కథ.

మైనస్ పాయింట్స్: 
నెమ్మదైన కథనం. 
కొన్ని కథల్లో ముగింపు ఊహకు అందేలా ఉండటం.


నటీనటుల పనితీరు: 

నటుడు వెట్రి తన నటనతో ఆకట్టుకున్నారు. అమ్ము అభిరామి నర్సు పాత్రలో చాలా సహజంగా నటించి మెప్పించింది. సాక్షి అగర్వాల్ మరియు ఇతర నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.

ఫైనల్గా :

క్రైమ్ థ్రిల్లర్స్ మరియు సోషల్ డ్రామాలు ఇష్టపడే వారు ఓసారి ట్రై చేయొచ్చు






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.