Home

»

Latest News

`ఇంద్రుడు - చంద్రుడు`గా క‌మ‌ల్ హాస‌న్ ఎంట‌ర్టైన్ చేసి నేటికి 32 ఏళ్ళు!

Nov 24, 2021 2:50PM

లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ తెలుగులో నేరుగా న‌టించిన సినిమాల్లో సింహ‌భాగం విజ‌యం సాధించాయి. అలాగే, అవార్డుల పంట పండించాయి. వాటిలో.. `ఇంద్రుడు - చంద్రుడు` చిత్రం ఒక‌టి. ఇందులో మేజ‌ర్ జీకే రాయుడు, చంద్రంగా క‌మ‌ల్ చేసిన ద్విపాత్రాభిన‌యం తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించ‌డ‌మే కాకుండా..`ఉత్త‌మ న‌టుడు`గా ఇటు `నంది` పుర‌స్కారాన్ని, అటు `ఫిల్మ్ ఫేర్` అవార్డుని పొందేలా చేసింది. క‌మ‌ల్ కి జంట‌గా లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి న‌టించిన ఈ సినిమాలో శ్రీ‌విద్య‌, న‌గేశ్, చ‌ర‌ణ్ రాజ్, జ‌య‌ల‌లిత‌, పి.ఎల్. నారాయ‌ణ‌, గొల్ల‌పూడి మారుతి రావు, డ‌బ్బింగ్ జాన‌కి, క్రేజీ మోహ‌న్, ప్ర‌దీప్ శ‌క్తి ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ఆకట్టుకున్నారు.

మ్యూజిక్ మేస్ట్రో ఇళ‌య‌రాజా బాణీల‌కు దిగ్గ‌జ గీత ర‌చ‌యిత‌లు వేటూరి సుంద‌ర‌రామ్మూర్తి, సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి సాహిత్య‌మందించారు. ``సంధ్యారాగ‌పు స‌రిగ‌మ‌లో``, ``దోర దోర దొంగ‌ముద్దు``, ``లాలి జో లాలీ జో ఊరుకో పాపాయి``, ``న‌చ్చిన పుడ్డు``, ``కాలేజీ ఏజ్ లో టీనేజీ మోజులో``.. ఇలా ఇందులోని గీతాల‌న్ని విశేషాద‌ర‌ణ పొందాయి. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మూవీ మొఘ‌ల్ డి. రామానాయుడు నిర్మించిన ఈ చిత్రానికి ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ సంభాష‌ణ‌లు అద‌న‌పు బ‌లంగా నిలిచాయి. 1989 న‌వంబ‌ర్ 24న విడుద‌లై అఖండ విజ‌యం సాధించిన `ఇంద్రుడు - చంద్రుడు`.. నేటితో 32 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com