![]() |
![]() |

సూపర్ స్టార్ కృష్ణ, కింగ్ నాగార్జున తండ్రీకొడుకుల పాత్రల్లో నటించిన మల్టిస్టారర్ మూవీ `వారసుడు`. హిందీ చిత్రం `ఫూల్ ఔర్ కాంటే` (అజయ్ దేవగణ్, మధుబాల డెబ్యూ మూవీ)కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో నాగ్ కి జంటగా నగ్మా కనువిందు చేసింది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మురళీమోహన్ సమర్పణలో శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. కిశోర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. శ్రీకాంత్, దేవరాజ్, బ్రహ్మానందం, బాబూ మోహన్, గుమ్మడి, తిరుపతి ప్రకాశ్, పృథ్వీరాజ్, జీవా, శరత్ సక్సేనా, తనికెళ్ళ భరణి, గీత, హేమ, మాస్టర్ బాలాదిత్య ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
స్వరవాణి కీరవాణి బాణీలతో రూపొందిన ఈ చిత్రంలోని గీతాలన్ని విశేషాదరణ పొందాయి. ``పాప హలో హలో``, ``డేంజర్ డేంజర్``, ``సిలక లాగా``, ``ఛమ్ ఛమ్ ప్రియా``, ``ధిన్ తనక్ ధిన్``.. ఇలా ఇందులోని ఐదు పాటలు అప్పటి కుర్రకారుని ఉర్రూతలూగించాయి. 1993 మే 6న విడుదలై అఖండ విజయం సాధించిన `వారసుడు`.. నేటితో 28 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |