Home

»

Latest News

2022 ఫ‌స్టాఫ్ రివ్యూ3: ప్ర‌తీ నెల‌లోనూ మ‌ల్టిస్టార‌ర్స్!

Jun 22, 2022 6:56PM

2022 ఫ‌స్టాఫ్ లో ప‌లు మ‌ల్టిస్టార‌ర్స్ సంద‌డి చేశాయి. జ‌న‌వ‌రి నుంచి జూన్ వ‌ర‌కు ప్ర‌తీ నెల‌లోనూ ఈ త‌ర‌హా చిత్రాలు సంద‌డి చేసి.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు వినోదాలు పంచాయి. ఆ వివ‌రాల్లోకి వెళితే..

జ‌న‌వ‌రి - బంగార్రాజు:

2016లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `సోగ్గాడే చిన్ని నాయ‌నా`కి సీక్వెల్ గా రూపొందిన `బంగార్రాజు` జ‌న‌వ‌రి 14న జ‌నం ముందు నిలిచింది. ఇందులో అక్కినేని నాగార్జున‌తో పాటు ఆయన త‌న‌యుడు యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య కూడా సంద‌డి చేశారు. సంక్రాంతి సీజ‌న్ లో వ‌చ్చిన ఈ మ‌ల్టిస్టార‌ర్.. చెప్పుకోద‌గ్గ ఫ‌లితాన్నే సొంతం చేసుకుంది.

ఫిబ్ర‌వ‌రి - భీమ్లా నాయ‌క్:

మాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `అయ్య‌ప్ప‌నుమ్ - కోషియుమ్` ఆధారంగా తెర‌కెక్కిన `భీమ్లా నాయ‌క్`లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - ద‌గ్గుబాటి స్టార్ రానా క‌లిసి న‌టించారు. ఫిబ్ర‌వ‌రి 25న తెర‌పైకి వ‌చ్చిన ఈ మ‌ల్టిస్టార‌ర్.. మంచి వ‌సూళ్ళు రాబ‌ట్టింది.

మార్చి - ఆర్ ఆర్ ఆర్:

తెలుగునాట చాన్నాళ్ళ త‌రువాత తెర‌కెక్కిన సిస‌లైన మ‌ల్టిస్టార‌ర్ `ఆర్ ఆర్ ఆర్`. యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో రూపొందిన ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్.. మార్చి 25న విడుద‌లై జాతీయ స్థాయిలో సంచ‌ల‌నం సృష్టించింది.

ఏప్రిల్ - ఆచార్య:

మెగాస్టార్ చిరంజీవి - మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో రూపొందిన మ‌ల్టిస్టారర్ `ఆచార్య‌`. ఏప్రిల్ 29న ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేట‌ర్స్ లోకి వ‌చ్చింది. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ సినిమా నిరాశ‌ప‌రిచింది.

మే - ఎఫ్ 3:

`ఎఫ్ 2` ఫ్రాంచైజీలో రెండో సినిమాగా తెర‌కెక్కిన `ఎఫ్ 3`.. మే 27న జ‌నం ముందు నిలిచింది. `ఎఫ్ 2`లో న‌టించిన విక్ట‌రీ వెంక‌టేశ్, మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్.. `ఎఫ్ 3`లోనూ హీరోలుగా సంద‌డి చేశారు. మంచి అంచ‌నాల న‌డుమ‌ విడుద‌లైన ఈ మ‌ల్టిస్టార‌ర్.. చెప్పుకోద‌గ్గ ఫ‌లితాన్ని అందుకుంది.

జూన్ - విక్ర‌మ్:

జూన్ నెల‌లో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన మ‌ల్టిస్టార‌ర్ `విక్ర‌మ్`. త‌మిళ అనువాద చిత్ర‌మైన `విక్ర‌మ్`లో లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ తో పాటు మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి, మాలీవుడ్ స్టార్ ఫ‌హ‌ద్ ఫాజిల్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. అలాగే కోలీవుడ్ స్టార్ సూర్య అతిథి పాత్ర‌లో మెరిశారు. జూన్ 3న విడుద‌లైన `విక్ర‌మ్`.. సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com