Home

»

Latest News

ప‌ద‌హారేళ్ళ‌ `విక్ర‌మార్కుడు`!

Jun 23, 2022 3:09PM

మాస్ మ‌హారాజా ర‌వితేజ స్థాయిని పెంచిన చిత్రాల్లో `విక్ర‌మార్కుడు`కి ప్ర‌త్యేక స్థానం ఉంది. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ సినిమాలో ACP  విక్ర‌మ్ సింగ్ రాథోడ్, అత్తిలి స‌త్తి బాబుగా రెండు విభిన్న పాత్ర‌ల్లో ఆక‌ట్టుకున్నారు ర‌వితేజ‌.  అనుష్క క‌థానాయిక‌గా న‌టించిన ఈ కాప్ డ్రామాలో బ్ర‌హ్మానందం, అజ‌య్, రాజీవ్ క‌న‌కాల‌, బేబి నేహ‌, అమిత్ తివారి, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, ర‌ఘు బాబు, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించ‌గా.. ప్ర‌కాశ్ రాజ్ అతిథి పాత్ర‌లో మెరిశారు. మేఘ‌నా నాయుడు ఓ ప్ర‌త్యేక గీతంలో త‌న చిందుల‌తో క‌నువిందు చేసింది. వి. విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ను అందించిన `విక్ర‌మార్కుడు`కి ఎం. ర‌త్నం సంభాష‌ణ‌లు స‌మ‌కూర్చారు.

స్వ‌ర‌వాణి కీర‌వాణి బాణీలు అందించిన ఈ చిత్రంలో ``జుమ్ జుమ్ మాయ‌``, ``జింతాక్ తాక్``, ``వ‌స్తవా వ‌స్త‌వా``, ``దూరంగా``, ``డ‌మ్మారే డ‌మ్మ‌``, ``జో లాలి`` అంటూ మొద‌ల‌య్యే పాట‌ల‌న్నీ ఆక‌ట్టుకున్నాయి.   శ్రీ కీర్తి క్రియేష‌న్స్ ప‌తాకంపై ఎం.ఎల్. కుమార్ చౌద‌రి నిర్మించిన `విక్ర‌మార్కుడు`..  త‌మిళంలో `సిరుత్తై`, క‌న్న‌డలో `వీర మ‌ద‌క‌రి`, హిందీలో `రౌడీ రాథోర్`, ఇండియ‌న్ బెంగాలీలో `బిక్ర‌మ సింఘ‌`,  బంగ్లాదేశీ బెంగాలీలో `ఉల్టా ప‌ల్టా 69`, `యాక్ష‌న్ జాస్మిన్` పేర్ల‌తో రీమేక్ అయింది. 2006 జూన్ 23న విడుద‌లై ఆ యేటి మేటి గ్రాస‌ర్స్ లో ఒక‌టిగా నిలిచిన `విక్ర‌మార్కుడు`..  నేటితో 16 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com