రాకింగ్ స్టార్ యష్ ఈ రోజు టాక్సిక్ తో వరల్డ్ వైడ్ గా అడుగుపెట్టాడు. మరి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకున్న' టాక్సిక్' ఎలా ఉందో చూద్దాం.
కథ
రాయ (యష్).. భవిష్యత్ పై ఆశ, చావు భయంలేని మిసైల్ లాంటి వ్యక్తి. ప్రేమ, పాశం లాంటి వాటికి కూడా చాలా దూరంగా ఉంటూ మందు,మగువతో సావాసం చేయడం రాయ హాబీ. చట్ట విరుద్ధంగా 'opium ' అనే అత్యంత ఖరీదైన డ్రగ్ ని డీల్ చేసే అసాంఘిక కంపెనీలో నెంబర్ 2 పొజిషన్ లో ఉంటాడు. అక్క గంగ (నయనతార) అంటే చాలా ఇష్టం. రాయని కింగ్ గా చూడాలనేది గంగ జీవిత లక్ష్యం. రాయని తన అల్లుడుగా చేసుకోవాలని నెంబర్ 1 సల్వా దార్ (డారెల్ డిసిల్వా) కోరిక. తన కూతురు పేరు రెబకా (తార సుతారియా). రాయ, రెబకా శారీరకంగా కూడా కలిస్తారు. నడియా (కియారా అద్వానీ) ఒక ఫేమస్ సర్కస్ కంపెనీ లో స్టంట్స్ మెజీషియన్. ఆత్మభిమానం పొగరు కలగలిపిన యువతీ. నడియాని ఇష్టపడిన రాయ శారీరకంగా కాలుస్తాడు. ఒక కొడుకు కూడా పుడతాడు. కానీ రాయ వాళ్ళకి దూరంగా ఉంటూ కొడుకుని సైతం చంపేస్తాడు. రాయ నిజంగానే కొడుకుని చంపాడా? అంతగా ప్రేమ, పాశం లేని వ్యక్తినా? నడియా ఏమైంది? రెబకా ఏమైంది? రాయ జీవితంలోకే వచ్చిన మెలిసా (రుక్మిణి వసంత్), టికెట్ (యష్) ల కథ ఏంటనేదే టాక్సిక్.
మేకర్స్ టాక్సిక్ కథని ఎలా ఓకే అనుకోని తెరకెక్కించారో అని మూవీ చూస్తున్నంత సేపు అర్ధమవుతుంది.డ్రగ్ నేపథ్యంలో మొదలైన కథ అసాంఘిక శక్తుల మధ్య పోరాటం, రాయ వ్యక్తిగత జీవితం నేపథ్యంతో టాక్సిక్ కథ ముగిసింది. ఓపెనింగ్ సీన్ తో పాటు మొదటి పది నిముషాలు ఒక మాదిరిగానే ఉన్నా, మూవీ జరిగే కొద్దీ టాక్సిక్ నచ్చుతుందేమో అని అనుకుంటాం. కానీ మూవీలోకి వెళ్లే కొద్దీ సహనానికి పరీక్ష పెడుతుంది. తుపాకుల శబ్దాలు, ఆల్కహాల్ తాగడం, రొమాన్స్ తప్ప ఏం లేదు. విచిత్రంగా నటీనటుల హావభావాలు కూడా డల్ గా సాగుతాయి. ఫస్ట్ హాఫ్ ఓపెన్ చేస్తే యష్ ఎంట్రీ సీన్ తేలిపోయింది. ఆ తర్వాత రెబాక( తార సుతారియా) తో వచ్చిన రొమాన్స్ సీన్స్ బాగానే ఉన్నాయి. యాక్షన్ సీన్స్ సైతం పర్లేదు. ఆ తర్వాత నడియా(కియారా అద్వానీ) ఎంట్రన్స్ తో అయినా కథనంలో ఊపు వస్తుందేమో అనుకుంటాం. కానీ అలాంటిదేం ఉండదు. గంగ, రాయ పై వచ్చిన సీన్స్ సైతం బాగోలేదు. ఇంటర్వెల్ ముందు వచ్చిన యాక్షన్ సీక్వెన్స్ పర్లేదు. సెకండ్ హాఫ్ చూసుకుంటే రాయలో మరో కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ సీన్స్ నడిచినా వాటిని ఎలివేట్ చేయడంలో ఫైర్ మిస్ అయ్యింది. ఏ క్యారక్టర్ ఎప్పుడు సరదాగా ఉంటుందో, సీరియస్ గా ఉంటుందో తెలియదు. మెలిసా( రుక్మిణి వసంత్) ,రాయ మధ్య వచ్చిన సీన్స్ . అవసరం, శారీరక సుఖం కోసమే బంధాలు ఏర్పడతాయనే విధంగా ఉన్నాయి. టికెట్( యంగ్ యష్) ఇంట్రడక్షన్, శాడిజంతో కూడిన వైలెన్స్ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అలాంటి సీన్స్ అన్ని చాలా సినిమాల్లో వచ్చేసినవే. ప్రొడక్షన్ వాల్యూస్, ఫొటోగ్రఫీ, యష్ నటన మాత్రం పర్లేదు. డైలాగ్స్ పర్వాలేదనే స్థాయిలోనే ఉన్నాయి.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు
రాయ, టికెట్ గా యష్ నటన అభిమానులకి నచ్చుతుంది. కానీ కథనంలో పదును లేకపోవడంతో కొన్ని చోట్ల తేలిపోతుంది. కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తార సుతారియా పెర్ ఫార్మ్ పర్లేదు. నయనతార మాత్రం పెద్దగా మెప్పించలేకపోయింది. మిగతా ఆర్టిసుల గురించి పెద్దగా చెప్పుకునే అవసరం లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫొటోగ్రఫీ, విజువల్స్ , డైరెక్షన్ ఎక్స్ టార్డినరీ. నిర్మాణ విలువలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఎడిటింగ్ మైనస్
బలాలు
- యష్ పెర్ ఫార్మెన్స్
- ప్రీ క్లైమాక్స్ లో వచ్చిన యాక్షన్ ఎపిసోడ్
- నిర్మాణ విలువలు
బలహీనతలు
- కథ, కథనం
టాక్సిక్ ని కథ, కథనం దెబ్బకొట్టింది. యష్ పెర్ ఫార్మెన్స్, ప్రొడక్షన్ వాల్యూస్ కొంచం రక్షణగా నిలిచాయి.
- అరుణాచలం