Home » Movie Reviews » ఎస్. సరస్వతి



Facebook Twitter Google


-సినిమా పేరు: ఎస్. సరస్వతి 
-న‌టీన‌టులు: వరలక్ష్మి శరత్ కుమార్, రాధిక శరత్ కుమార్, ప్రకాష్ రాజ్,ప్రియమణి, జీవా నాజర్, రావు -రమేష్, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సప్తగిరి, కిషోర్, రఘుబాబు తదితరులు
-సినిమాటోగ్ర‌ఫీ: ఏ ఎం ఎడ్విన్ 
-ఎడిటింగ్: వెంకట్ రాజన్ 
-మ్యూజిక్ : థమన్ 
-నిర్మాత‌: వరలక్ష్మి శరత్ కుమార్, పూజా శరత్ కుమార్ 
-బ్యానర్స్ : దోశ డైరీస్, ఈటీవీ విన్ 
-కథ: సాయిమాధవ్ బుర్ర 
-స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వరలక్ష్మి శరత్ కుమార్
-రిలీజ్ డేట్ : మార్చి 6 , 2026 

ఎలాంటి క్యారక్టర్ నైనా అవలీలగా పోషించే నటి 'వరలక్ష్మి శరత్ కుమార్'(Varalaxmi Sarath Kumar).ఈ రోజు ఎస్. 'సరస్వతి' అనే మూవీతో సిల్వర్ స్క్రీన్ పై టేక్ ఆఫ్ అయ్యింది. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కడం, స్టార్ కాస్టింగ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం సరస్వతి ప్రత్యేకత. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ
లక్మి(వరలక్ష్మి శరత్ కుమార్) నర్సుగా పని చేస్తుంటుంది. మంచి మనసు తన సొంతం. కూతురు పేరు సరస్వతి(నివేక్ష నాయుడు) ప్రైవేట్ స్కూల్ లో 7 th క్లాస్ చదువుతుంటుంది. భర్త పేరు ఆదిత్య( జీవా) ముంబై లో ఫేమస్ డాక్టర్. లక్ష్మి కి ఫాంటసీ ఫాండ్ డిస్ ఆర్డర్ అనే అరుదైన వ్యాధి ఉంటుంది. మరో వైపు లక్ష్మి ( ప్రియమణి) అనే పేరు గల మరో ఆవిడ ప్రభాకర్ (కిషోర్) దంపతులకి కూడా సరస్వతి అనే పాప ఉంటుంది. ఒక రోజు స్కూల్ నుంచి సరస్వతి ఇంటికి రాదు. దీంతో ఇద్దరు లక్ష్మి లు స్కూల్ దగ్గరకి వెళ్తారు. అక్కడ ఒక భయంకరమైన నిజాన్నిచూస్తారు. ఆ ఇద్దరు చూసిన నిజం ఏంటి? ఆ నిజానికి వాళ్ళు ఇచ్చిన జవాబు ఏంటి? సరస్వతి లు ఇద్దరు ఉన్నారా? లేక ఒకరా? లక్ష్మి కి  ఉన్న ఫాంటసీ ఫాండ్ డిస్ ఆర్డర్ వ్యాధి యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది? మరి డాక్టర్ అయిన ఆదిత్య ఎందుకు సరస్వతి కి దూరంగా ఉంటున్నాడు? ఈ కథలోకి  లాయర్ రామానుజం(ప్రకాష్ రాజ్) ఎంట్రీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది?  సొసైటీకి సరస్వతి ఎలాంటి మెసేజ్ ఇచ్చిందనేదే చిత్ర కథ.   



ఎనాలసిస్ :

ప్రస్తుత సమాజంలో సరస్వతి లాంటి సినిమాలు ఖచ్చితంగా అప్పుడప్పుడు వస్తూనే ఉండాలి. తద్వారా సమాజంలో ఎంతటి దారుణమైన  సంఘటనలు జరుగుతున్నాయి. ఆడపిల్లలు ఉన్న తల్లి తండ్రులు ఎంత జాగ్రతగా ఉండాలో చెప్తుంది. కాకపోతే హడావుడి సృష్టిస్తూ భారీగా పిక్చరైజ్ చెయ్యాల్సిన పాయింట్ ని సింపుల్ గా డైలాగ్స్ తో తేల్చి పడేసారు. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే డైరెక్ట్ గా కథలోకి వెళ్లడంతో మనం కూడా సరస్వతితో ట్రావెల్ అవుతాం. స్కూల్ లో వచ్చే సరస్వతి సీన్ తో పాటు తల్లితో ఫోన్ మాట్లాడే సందర్భంగా సరస్వతి చెప్పే మాటలతో కన్నీళ్లు వస్తాయి. కథలో ట్రావెల్ అయ్యే కొద్దీ అలాంటి మానవ మృగాలని నడిరోడ్డులో ఉరి తీయాలని మనం కూడా గట్టిగానే అనుకుంటూ ఉంటాం.

సరస్వతి, లక్ష్మి మధ్య ఇంకా సీన్స్ వచ్చి ఉంటే బాగుండేదేమో. రామానుజం గా ప్రకాష్ రాజ్ ఎంట్రీ తో కథకి మంచి స్పీడ్ వచ్చింది. కాకపోతే లక్ష్మి కేసుని వాదించడానికి టైం తీసుకోవాల్సింది. కోర్టు సీన్స్ కూడా బాగున్నాయి. ఇంటర్ వెల్ ట్విస్ట్ ఒక రేంజ్ లో సెట్ అయ్యింది. సెకండ్ హాఫ్ లో నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ వర్క్ అవుట్ కాలేదు. సరస్వతి, ఆమె తల్లి లక్ష్మి, తండ్రి ప్రభాకర్ మధ్య వచ్చిన ఎపిసోడ్ బాగా పేలింది. తమ బిడ్డ  సరస్వతికి చెప్పుకోలేని అన్యాయం జరిగినప్పుడు లక్ష్మి, ప్రభాకర్ ల బాధ, కోపాన్ని మాత్రం నార్మల్ గా ఎందుకు చూపించారో అర్ధం కాదు. ఎదుటివాళ్ళని చంపేయ్యాలంతా కోపం రావాలి కదా!  సరస్వతి, ఆదిత్య ల ఫ్లాష్ బ్యాక్  బాగుంది. కథ మొత్తానికి ఈ ఇద్దరి మధ్య జరిగే శారీరక కలయిక లో వచ్చిన మార్పునే ప్రదానం కాబట్టి ఆదిత్య క్యారక్టర్ ని చెడ్డవాడిగా కాకపోయినా కొంచం నెగిటివ్ గా చూపించాల్సింది.

పైగా ఫస్ట్ హాఫ్ లోనే ఆదిత్య క్యారక్టర్ ని యూజ్ చేసుకుంటూ ఉంటుంటే కథకి మంచి పెప్ వచ్చి ఉండేది. ఫస్ట్ హాఫ్ లో వచ్చిన కోర్టు సీన్స్ కంటే సెకండ్ హాఫ్ లో వచ్చిన కోర్ట్ సీన్స్ పెద్దగా పేలలేదు. ఎన్నో ట్విస్ట్ లని నింపాల్సింది పోయి సింపుల్ గా తేల్చిపడేసారు. నాజర్, రాధిక సీన్స్ బాగున్నాయి. ప్రీ క్లైమాక్స్,క్లైమాక్స్  పర్లేదు. సరస్వతి ఇచ్చే ట్విస్ట్ తో   ఎండ్ చేసే కంటే రామానుజం నుంచి ట్విస్ట్ రావాల్సింది. నీ కథ మొత్తం నాకు తెలుసు నిన్ను బయటపడెయ్యడానికే కేసు తీసుకున్నాను అని.

 నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు 

వరలక్ష్మి పెర్ఫార్మ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన నటనలో దాగి ఉన్న మరో కొత్త కోణాన్ని పరిచయం చేసింది. స్క్రీన్ పై వరలక్ష్మి కనిపిస్తున్నంత సేపు చూపుని పక్కకి కూడా తిప్పుకోము. అంతలా మెస్మరైజ్ చేసింది. ప్రియమణి కూడా అంతే. పెర్ఫార్మెన్స్ లో తగ్గడం అనేది జరగని పని అనే విధంగా నిడివి తక్కువైనా తన క్యారక్టర్ ద్వారా మెరుపులు చూపించింది. ఇక ప్రకాష్ రాజ్(Prakash Raj) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద నాలా యాక్ట్  చేసే కెపాసిటీ ఎవరికైనా ఉందేమో, సరస్వతి ని చూసి చెక్ చేసుకోండి అనే విధంగా మెస్మరైజ్ చేసాడు. చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్ లోను అదే ఆనవాయితీ. రాధిక, నాజర్ ల నిడివి పెద్దగా లేకపోయినా తమ క్యారక్టర్ పరిధి మేరకు చేసి సరస్వతి కి హుందాతనాన్ని తీసుకొచ్చారు. మిగతా క్యారక్టర్ లలో చేసిన రావు రమేష్ ,కిషోర్,సప్తగిరి ల పెర్ఫార్మ్  బాగుంది. వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకురాలిగా నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయినా స్క్రీన్ ప్లే లో మాత్రం తడబడింది. బుర్రా సాయి మాధవ్ నుంచి వచ్చిన  కథ ప్రధాన హైలెట్. నేషనల్ బర్డ్,నేషనల్ యానిమల్ ని చంపితే బెయిల్ రాదు. ఆడవాళ్ళని రేప్ చేసినా, చంపినా బెయిల్ ఎందుకు ఇస్తున్నారు అనే డైలాగ్ అయితే  చట్టాలని ఖచ్చితంగా ప్రశ్నించే స్థాయిలో ఉంది. ఎడ్విన్  ఫొటోగ్రఫీ, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సరస్వతికి ప్రాణం పోశాయి. నిర్మాణ విలువలు మైనస్.



తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

చివరిగా చెప్పుకోవాలంటే మంచి కథ. మంచి ప్రయత్నం. ఇలాంటి కథలు సిల్వర్ స్క్రీన్ పై చాలానే వచ్చినా థ్రిలర్ ని ఎంజాయ్ చేసే వాళ్ళకి నచ్చుతుంది 

బలాలు
1 .స్టోరీ 
2 . వరలక్ష్మి శరత్ కుమార్, ప్రకాష్ రాజ్ తో పాటు ఆల్ ఆర్టిస్ట్స్ పెర్ ఫార్మెన్స్ 
3 . సరస్వతి, లక్ష్మి ల క్యారక్టర్ డిజైన్ 
4 . ఇంటర్వెల్ ట్విస్ట్ 
5 . సరస్వతి స్కూల్ ఎపిసోడ్ 
6 . సరస్వతి, ఆదిత్య ఇచ్చే ట్విస్ట్ 
7 . ఫొటోగ్రఫీ 
8 . దర్శకత్వం 
9. కోర్టు సీన్స్ 

బలహీనతలు 
1 . లో బడ్జెట్ 
2 . కథనం లో క్లారిటీ లేకపోవడం 
3 .సెకండ్ హాఫ్ 
4 .సాంగ్స్
5 .డైలాగ్స్ 

 

Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.