Home » Movie Reviews » మకుటం



Facebook Twitter Google


న‌టీన‌టులు: విశాల్, అంజలి, దునియా విజయన్, జాన్ విజయ్,జయప్రకాష్ తదితరులు 
సినిమాటోగ్ర‌ఫీ: రిచర్డ్ ఎం నాథన్
ఎడిటర్: ఎన్ బి శ్రీకాంత్ 
మ్యూజిక్: జివి ప్రకాష్ కుమార్ , అభినందన్ రామానుజం 
నిర్మాత‌: జితన్ రమేష్ ,జీవా
బ్యానర్: సూపర్ గుడ్ ఫిల్మ్స్
సమర్పణ: ఆర్ బి చౌదరి
స్క్రీన్ ప్లే ,దర్శకత్వం: విశాల్ 

విశాల్ ఈ రోజు 'మకుటం' మూవీతో థియేటర్స్ లోకి వచ్చాడు. ఇటీవల దివంగతులైన లెజెండరీ ప్రొడ్యూసర్ ఆర్ బి చౌదరి నిర్మాత. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ
కృపాకర్ (విశాల్) చెన్నైనగరంలో నివసించే సాధారణ మిడిల్ క్లాస్ వ్యక్తి. గొడవలకి దూరంగా ఉంటూ అందరూ బాగుండాలనే వ్యక్తిత్వం. మెడికల్ రిప్రజెంటివ్ గా వర్క్ చేస్తుంటాడు. భార్య జమున( దునియా విజయన్) తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న కొడుకు, ఆరు సంవత్సరాల వయసున్న పాప ఉంటారు. కారు కొనాలనేది ఆ ఫ్యామిలీ ఆశ. దీంతో సెకండ్ హ్యాండ్ కారు కొంటారు. కారులో వెకేషన్ కి వెళ్తే కారు నెంబర్ ఆధారంగా విశాఖపట్నంకి చెందిన ఇల్లీగల్ బిజినెస్ చేసే నాగ(అజయ్) తన మనుషులతో కృపాకర్ ఫ్యామిలీపై హత్యా ప్రయత్నం జరిపిస్తాడు. దీంతో కృపాకర్ భార్య, కూతురు చనిపోతారు. చెన్నైలో ఉన్న కృపాకర్ కి, నాగకి సంబంధం ఏంటి? చంపేంత పగ ఉంటే ఆ ఇల్లీగల్ బిజినెస్ ఏంటి? ఆ బిజినెస్ వల్ల సమాజానికి ఏమైనా ముప్పు ఉందా? అసలు  కృపాకర్ కి ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా? ఉంటే ఆ ఫ్లాష్ బ్యాక్ మంచిదా? చెడ్డదా? అనేదే మకుటం.



ఎనాలసిస్ :

మకుటం లాంటి కథతో తెరకెక్కిన చిత్రాలు చాలానే వచ్చాయి. సీన్స్ కూడా చూసేసినవే.  నాగార్జున వారసుడు, విజయ్ లియో, కమల్ హాసన్ నాయకుడు ని మిక్స్ చేసారు. కాకపోతే విశాల్ పెర్ ఫార్మెన్స్ మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ చూసుకునే మూవీ స్టార్ట్ అవ్వడమే డల్ గా సాగింది. జమున, కృపాకర్ మధ్య వచ్చే సన్నివేశాలు వర్క్ అవుట్ కాలేదు. దాదాపుగా అరగంటపై దాకా కథ ఏంటో అర్ధం కాదు. ఆ తర్వాత విషయం అర్ధమయ్యి అనేక చిత్రాలు మన మనసులో మెదులుతూ ఉంటాయి. దీంతో మకుటంతో పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోతుంటాం.

కృపాకర్ కూతురు, భార్య చనిపోవడం అనేది అంతగా జీర్ణించుకోలేం. ఆ విధంగా కాకుండా కృపాకర్ తన తండ్రితో నీ  వల్ల ఏర్పడిన శత్రువులని నీ సపోర్ట్ లేకుండా ఏరిపారేసి నా భార్య, బిడ్డలకి చీమ కుట్టినంత హనీ జరగకుండా చేస్తానని చేసి ఉంటే కథకి కొత్త కలర్ వచ్చేది. అలా కాకుండా కథ ఎటు పోతే అటు నేను అన్నట్టుగా కృపాకర్ క్యారక్టర్ ని తీర్చిదిద్దారు. ఇంటర్వెల్ ట్విస్ట్ ఊహించిందే. సెకండ్ హాఫ్ లో లింగ (విశాల్) ఫ్లాష్ బ్యాక్ లో వచ్చిన సన్నివేశాల్లో అన్నపూర్ణ(అంజలి), లింగ లవ్ ఎపిసోడ్ పర్లేదు. మిగతా సీన్స్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి లేదు. లింగ్ ని పవర్ ఫుల్  డైలాగ్స్, ఫుల్ యాక్షన్ మోడ్ లో చూపించాల్సింది పోయి నార్మల్ గా చూపించారు.

కాకపోతే రవాణా వాహనాల్లో వాడే 'స్పేర్ పార్ట్స్' స్మగ్లింగ్ రూపంలో చైనా నుంచి డూప్లికేట్ వి  రావడం వలన, వాటిని వాడి ప్రతి సంవత్సరం ఎంతో మంది చనిపోతున్నారనే పాయింట్ బాగుంది. కథ మొత్తం ఈ పాయింట్ పైనే బేస్ చేసుకొని నడిపి, పారలాల్ గా తండ్రి, కొడుకు సెంటిమెంట్ ని నడిపినా బాగుండేదేమో. క్లైమాక్స్ ని సాగతీసారు. బలమైన ప్రతినాయకుడు లేకపోవడం మైనస్.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు 
కృపాకర్, లింగ గా విశాల్ పెర్ ఫార్మ్ నార్మల్ గానే ఉంది.  ఎలాంటి మెరుపులు లేవు.  దర్శకుడిగా కూడా పెద్దగా మెప్పించలేకపోయాడు. ఆర్టిస్టుల నుంచి  నటన రాబట్టుకోవడంలో ఈ విషయం అర్ధమవుతుంది. టేకింగ్ కూడా ఓల్డ్ ఫార్మేట్. జాన్ విజయ్ కొన్ని సార్లు బాగా నటించాడు. కొన్ని సార్లు సంతృప్తి కరమైన పెర్ఫార్మ్ ఇవ్వలేకపోయాడు. అంజలి తన క్యారక్టర్ కి నూటికి నూరుపాళ్లు న్యాయం చేసింది. యాక్షన్ సీన్ లో కూడా తన సత్తా చాటింది. దునియా విజయన్ తో పాటు పిల్లలు కూడా తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇంక ఎవరు గురించి పెద్దగా చెప్పుకోవాలిన పని లేదు. అజయ్ ఉన్నా రెండు మూడు సీన్స్ కే పరిమితమయ్యాడు. జి వి ప్రకాష్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్దగా మెరుపులు లేవు. ఫొటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.

బలాలు
- ఫొటోగ్రఫీ 
- అంజలి పెర్ ఫార్మెన్స్ 

బలహీనతలు 
- ఓల్డ్ కథ,
- కథనం



తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

అందరూ చూసేసిన కథ, కథనంతో మకుటం ముస్తాబయ్యి వచ్చింది.

- అరుణాచలం 

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.