సినిమాపేరు: లెనిన్
నటీనటులు: అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, ప్రమోద్ పంజు, శివాజీ, సునీల్, బ్రహ్మాజీ, ఈశ్వరి రావు తదితరులు
సినిమాటోగ్రఫీ: లియోన్ బ్రిట్టో
ఎడిటింగ్: నవీన్ నూలి
మ్యూజిక్: థమన్
నిర్మాతలు: నాగార్జున, నాగవంశీ
బ్యానర్స్ : మనం ఎంటర్ ప్రైజెస్, సితార ఎంటర్ టైన్ మెంట్
రచన,దర్శకత్వం: మురళి కిషోర్ అబ్బూరు
రిలీజ్ డేట్ : జులై 10 ,2026
అభిమానుల, తెలుగు సినిమా ప్రేమికుల సుదీర్ఘ నిరీక్షణకి తెరదించుతు అఖిల్ అక్కినేని(Akhil Akkineni)ఈ రోజు లెనిన్(Lenin)తో సెల్యులాయిడ్ పై అడుగుపెట్టాడు. ఉదయం ఎనిమిది గంటల నుంచే షోస్ పడటంతో అక్కినేని అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొని ఉంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
లెనిన్ (అఖిల్) మంచితనంతో పాటు ఎలాంటి కల్మషం లేని యువకుడు. అనాధగా చిత్తూరు జిల్లాలోని భారతీమిట్ట శ్రీరామపురం అనే గ్రామం వస్తాడు.మహాభారతంలోని ద్రౌపది మాత కన్నీటి బొట్టుకి సాక్షిగా నిలిచిన ఊరు. లెనిన్ ని ఆ గ్రామవంశపారంపర్య పెద్ద జయంతి( ఈశ్వరి రావు)ఆమె కొడుకు వసంత్( ప్రమోద్ పంజు) చేరదీస్తారు. జయంతి చిన్న కొడుకులాగా పెరుగుతాడు. భారతి (భాగ్యశ్రీ బోర్సే) చలాకీ, చురుకుతనం నిండిన బాగా చదువుకున్న యువతి. భారతి, లెనిన్ ఒకరినొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు. దీంతో ఆ ఇద్దరికి ఈశ్వరి రావు, వసంత్ పెళ్లి చేస్తారు. మరి ఎలాంటి నెగిటివ్ క్యారక్టర్ లేని ఈ కథలో అసలు విలన్ ఎవరు? వాళ్ళ వాళ్ళ లెనిన్ కి ఏమైనా అన్యాయం జరిగిందా? జరిగితే ఎలాంటి అన్యాయం? అందుకు లెనిన్ ఏం చేసాడు? ద్రౌపది మాత కన్నీటి బొట్టుకి, లెనిన్ ఉన్న సంబంధమేంటి? యతిరాజు(శివాజీ) తో పాటు మిగతా క్యారక్టర్ లు ఏంటి? అసలు లెనిన్ కథ ఏంటి అనేదే చిత్ర కథ
మొదటి పావు గంట వచ్చే కథనం నార్మల్ గానే ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో ప్రతి సీన్ నడవడంతో పాటు లెనిన్, భారతి మధ్య వచ్చిన లవ్ సీన్స్ ఫ్రెష్ గా ఉన్నాయి. యతిరాజు సీన్స్ తో పాటు జయంతి, వసంత్ సీన్స్ బాగుండటంతో పాటు వాళ్ళ తాలూకు క్యారక్టర్ డిజైన్ తో నెక్స్ట్ ఏదో జరగబోతుందనే విషయం అర్దమవడంతో పాటు ఇంట్రెస్ట్ ని కలిగించాయి. ముఖ్యంగా భారతి సిస్టర్ వైదేహి ఎపిసోడ్ బాగా పేలింది. ఫస్ట్ హాఫ్ కి బలంగా నిలిచింది కూడా.
సాంగ్స్ కూడా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో లెనిన్, భారతి మ్యారేజ్ ఎపిసోడ్ తో పాటు యతిరాజు, వసంత్ క్యారక్టర్ లు టర్న్ తీసుకోవడం, ఆ సందర్భంగా వచ్చే సీన్స్ గూస్ బంప్స్ వస్తాయి. యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఆ సందర్భంగా వచ్చే సీన్స్ , అందుకు థమన్ ఇచ్చిన మ్యూజిక్ రోమాలు నిక్కబరుచుకునేలా చేస్తాయి. ఎవరు ఊహించని విధంగా సన్నివేశాలు రావడంతో పాటు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. టోటల్ గా సెకండ్ హాఫ్ లెనిన్ కి అతి పెద్ద ఎసెట్ గా నిలిచింది.
నటీనటులు సాంకేతిక నిపుణల పని తీరు
లెనిన్ గా అఖిల్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ప్రమోషన్స్ లో మేకర్స్ చెప్పినట్టుగానే అఖిల్ కనపడలేదు. లెనిన్ క్యారక్టర్ మాత్రమే కనపడింది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో అఖిల్ పెర్ఫార్మ్ నభూతో న భవిష్యత్. ఎంటైర్ తన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా అఖిల్ కెరీర్ లో లెనిన్ నిలిచిపోతుంది. లవ్, యాక్షన్ సన్నివేశాల్లో ఒక రేంజ్ పెర్ఫార్మ్ ఇచ్చాడు. భారతిగా భాగ్య శ్రీ బోర్సే మరోసారి తన అందచందాలతో ఆకట్టుకోవడమే కాకుండా అందమైన పెర్ఫార్మ్ చేసింది. ఆ క్యారక్టర్ లో తను తప్పించి మరొకర్ని ఉహించుకోలేం. సీనియర్ యాక్టర్స్ శివాజీ, బ్రహ్మాజీ, సునీల్ మరోసారి అద్భుతమైన పెర్ఫార్మ్ తో మెప్పించారు. నెగిటివ్ రోల్ లో చేసిన ప్రమోద్ పంజు తన సినీ క్యాలండర్ బిజీ ఉండేలా ఒక రేంజ్ పెర్ఫార్మ్ చేసాడు. ఈశ్వరి రావు తో పాటు మిగతా వాళ్ళు కూడా తమ క్యారక్టర్ పరిధి మేరకు నటించి మెప్పించారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ థియేటర్ లో అఖండ కి థియేటర్ లో ఎలా అయితే పూనకాలు వచ్చాయో. అదే పూనకాలు లెనిన్ కి కూడా తెప్పించాడు. తెప్పించడమే కాకుండా లెనిన్ ని అతి పెద్ద ప్లస్ అయ్యాడు. సాంగ్స్ ఇంకా బాగుండాల్సింది.లియోన్ బ్రిట్టో ఫొటోగ్రఫీ కూడా అంతే. లెనిన్ ని ప్రేక్షకులు తమ ఇంటి దాకా తీసుకెళ్లేలా ఉంది. నిర్మాణ విలువలు ప్లస్. మురళి కృష్ణ అబ్బూరి నుంచి వచ్చిన కథ, కధనం ఫస్ట్ హాఫ్ సో సో గా ఉన్నా, సెకండ్ హాఫ్ లో తన హవా చాటాడు. దర్శకుడిగా భారీగా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు
బలాలు
1 . కథ
2 . అఖిల్, భాగ్యశ్రీ బోర్సే తో పాటు ఆల్ ఆర్టిస్ట్ పెర్ ఫార్మెన్స్
3 . బ్యాక్ గ్రౌండ్ స్కోర్
4 . ప్రీ క్లైమాక్స్
5 . క్లైమాక్స్
బలహీనతలు
1 . ఫస్ట్ హాఫ్ లో కథని పెద్దగా చెప్పకపోవడం.
చివరిగా చెప్పుకోవాలంటే అఖిల్ తన వన్ మాన్ షో తో లెనిన్ ని నచ్చేలా చేసాడు.
Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.