Home » Movie Reviews » కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ



Facebook Twitter Google


సినిమా పేరు: కొరియన్ కనకరాజు
న‌టీన‌టులు: వరుణ్ తేజ్, రితిక నాయక్,సత్య, సునీల్, విటి గణేష్   తదితరులు 
సినిమాటోగ్ర‌ఫీ: మనోజ్ రెడ్డి
ఎడిటింగ్: సత్యా 
మ్యూజిక్: థమన్ 
నిర్మాత‌లు: రాజీవ్ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణారెడ్డి 
బ్యానర్స్: యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్
రచన,దర్శకత్వం: మేర్లపాక గాంధీ
రిలీజ్ డేట్ : ఆగష్టు 7 ,2026

 

కొరియన్ కనకరాజు' గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ థియేటర్స్ లో సందడి చేయడానికి వచ్చాడు.  వరుణ్ గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ ని అందుకుంటూ ఉండటం,  మిరాయ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్ కావడం,అగ్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్  నిర్మించడంతో అభిమానుల్లో, ప్రేక్షకులలో కొరియన్ కనకరాజు పై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ఒక రోజు ముందు ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు.మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ 

కనకరాజు(వరుణ్ తేజ్) ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంజిల్లా పెనుగొండ గ్రామానికి చెందిన దైర్యం, మొండితనంతో కూడిన మధ్య తరగతి యువకుడు. మంచి కోసం ఎంత వరకైనా వెళ్లే తత్వం కలవాడు కావడంతో ఊరి వాళ్ళందరూ కనకరాజుని బాగా కోపిష్టి అంటుంటారు . చైత్ర( రితికా నాయక్) కొరియా దేశంలో ఉద్యోగం సంపాదించి  కొరియా వ్యక్తినే పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అవ్వాలనే లక్ష్యంతో ఉంటుంది. కొరియాలో 'చో స్వాంగ్'  అనే వ్యక్తి  పేరు మోసిన గ్యాంగ్ స్టార్. ఫోర్ ఫింగర్స్ పేరుతో తన కార్యకలాపాలు నిర్వహిస్తూ అడ్డొచ్చిన వాళ్ళని క్రూరంగా చంపుతుంటాడు. అలాంటి వ్యక్తి తన శరీరాన్ని వదిలి కనకరాజు శరీరంలోకి ప్రవేశిస్తాడు.

దీంతో కనకరాజు కొరియాలో చో స్వాంగ్ లా చలామణి అవుతూ ఉంటాడు. ఎక్కడో కొరియాలో ఉన్న చో స్వాంగ్ ఎందుకు కనకరాజు బాడీలోకి వచ్చాడు?  వచ్చాక కనకరాజు పరిస్థితి ఏంటి? కనకరాజుకి తన శరీరంలో చో స్వాంగ్ ఉన్నాడని తెలుసా? తెలిస్తే ఏం చేసాడు? చివరకి కొరియన్ కనకరాజు కథ ఎలా ముగిసింది అనేదే చిత్ర కథ



ఎనాలసిస్ :

ఖచ్చితంగా వెరైటీ కథ. కాకపోతే ఇలాంటి కధల్ని తెరకెక్కించడం అంత ఆషామాషీ కాదు. దర్శకుడు మేర్లపాక గాంధీ రచయిత కాబట్టి బాగానే నడిపించాడు. కానీ అసలు కథ మొదలయ్యే సెకండ్ హాఫ్ లో  స్క్రీన్ ప్లే విషయంలో కొన్ని పొరపాట్లు చేసాడు. కొన్ని సీన్స్  చిన్న పిల్లలు ఆడుకునే ఆటలా  సాగాయి. సెకండ్ హాఫ్ తో పాటు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ విషయంలో మరింత జాగ్రత్త పడి ఉంటే  కనకరాజు హోదా ఇంకొంచం బెటర్ పొజిషన్ లో ఉండేది.పైగా అర్ధం లేని లాజిక్ తో కనకరాజు అన్నయ్య క్యారక్టర్ ని చో స్వాంగ్ కి లింక్ చెయ్యడం పాత కాలపు రొటీన్ ఫార్ములాని గుర్తు చేస్తుంది. ఆ విధంగా కాకుండా సినిమా యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఎంటర్ టైన్ మెంట్ కాబట్టి, కనకరాజుకి చో స్వాంగ్ తన బాడీలోకి వస్తున్నాడు కాబట్టి కనకరాజునే చో స్వాంగ్ తన బాడీలో నుంచి వెళ్లగొట్టుకునేలా ఎంటర్ టైన్ మెంట్ కోణంలో చూపించాల్సింది.

 

ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ కొరియాలో స్టార్ అయ్యే మంచి క్యూరియాసిటీని కలిగించింది. ఆ తర్వాత వచ్చిన కనకరాజు సీన్స్ తో పాటి ఇంట్రడక్షన్ సాంగ్ బాగుంది. చైత్ర, కనకరాజు సీన్స్ కూడా బాగున్నాయి. కనకరాజు శరీరంలోకి చో స్వాంగ్ ప్రవేశించే సీన్ తో పాటు ఆ తర్వాత వచ్చిన సీన్స్ కూడా ఎంటర్ టైన్ మెంట్ కోణంలో  ఫన్ పుట్టించాయి. చెంగారెడ్డి గా  సునీల్ తో వచ్చిన యాక్షన్ సీక్వెన్స్ సూపర్. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరింది.

సెకండ్ హాఫ్ లో కథ మొత్తం కనకరాజు, చైత్ర,  చో స్వాంగ్,  కనకరాజు ఫ్రెండ్ కృష్ణప్ప( సత్య) పైనే నడుస్తుంది. ఆ సందర్భంగా వచ్చిన సీన్స్ లో కొన్ని పర్లేదు. ముఖ్యంగా కనకరాజు మేకోవర్ సీన్స్ తో పాటు మాంత్రికుడైన తన తండ్రితో   కృష్ణప్ప వీడియో కాల్ మాట్లాడుతు భూతాన్ని పోగొట్టే సీన్స్ హైలెట్. సంక్రాంతికి వస్తున్నాం బుడ్డోడు, విటి గణేష్ మధ్య వచ్చిన కామెడీ సీన్స్ వర్క్ అవుట్ కాలేదు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సోసో. 


నటీనటులు సాంకేతిక నిపుణులపనితీరు 

వరుణ్ తేజ్ ప్రతి సీన్ లోను అద్భుతమైన పెర్ఫార్మ్ కనపరిచాడు. కామెడీ, యాక్షన్ సన్నివేశాల్లో తన మెరుపుని మరో సారి చాటాడు. ముఖ్యంగా గ్యాంగ్ స్టార్  చో స్వాంగ్ లా సెల్యులాయిడ్ పై తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. తన యాక్టింగ్ కెరీర్ లో గుర్తిండిపోయే మూవీనే. చైత్ర క్యారక్టర్ లో రితికా నాయక్ మరో సారి తన క్యూట్ పెర్ఫార్మ్ తో  మెస్మరైజ్ చేసింది. కృష్ణప్ప క్యారెక్టర్స్ తో మరో సారి సత్య తన పెర్ఫార్మ్ తో ఆకట్టుకొని మూవీకి బలంగా నిలిచాడు. సునీల్ తన క్యారక్టర్ లో మెరుపులు చూపించలేకపోయినా ఉన్నంతలో బాగా చేసాడు. చో స్వాంగ్ తో పాటు కొరియా నటులు అందరూ తమ నటనతో కొత్త రకం బాడీ లాంగ్వేజ్ ని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసారు. మేర్లపాక గాంధీ తన దర్శకత్వ ప్రతిభతో ప్రతి సీన్ ని అద్భుతమైన టేకింగ్ తో  కలర్ ఫుల్ గా నింపాడు. కానీ రచయితగా కనకరాజు పై కొంచం పక్షపాతం చూపించాడు. నిర్మాణ విలువలు, థమన్, ఫొటోగ్రఫీ లేకపోతే కనకరాజు లేడు అనే విధంగా తమ హవా చాలా బలంగా చాటారు. ముఖ్యంగా థమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెస్మరైజ్ చేసి పడేసాడు.


బలాలు
1 . కథ, దర్శకత్వం
2 . వరుణ్ తేజ్ పెర్ ఫార్మెన్స్ 
3 . యాక్షన్ సీక్వెన్స్ 
4 . బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 
5 . నిర్మాణ విలువలు, ఫొటోగ్రఫీ 
6 . ఫస్ట్ హాఫ్ 

బలహీనతలు 
 1 . ప్రీ క్లైమాక్స్ 
2 . క్లైమాక్స్ 

 



తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

చివరిగా చెప్పుకోవాలంటే వరుణ్ తేజ్, నిర్మాణ విలువలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొరియన్ కనకరాజుని పర్వాలేదని అనిపిస్తున్నాయి.  

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.