Home » Movie Reviews » అగధ



Facebook Twitter Google


న‌టీన‌టులు: కామాక్షి భాస్కర్ల , భానుచందర్, సిజ్జు, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, వనితా విజయ్ కుమార్, శ్రేయ రాణిరెడ్డి, రోషన్ బషీర్  తదితరులు 
సినిమాటోగ్ర‌ఫీ: నాని చమిడిశెట్టి 
ఎడిటింగ్: జునైద్ సిద్ధికి 
మ్యూజిక్: రాకేష్ వెంకటాపురం 
నిర్మాత‌ కాశీ విశాలాక్షి బలుసు 
బ్యానర్: శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ 
సమర్పణ: అజయ్ కె. ఆర్  
రచన, దర్శకత్వం: ఎం ఎస్ రాజు 

మహేష్, ప్రభాస్ ని ఒక్కడు, వర్షం సినిమాలతో స్టార్స్ గా నిలబెట్టిన హిట్ మేకర్  ఏంఎస్ రాజు. దర్శకుడు గాను తన సత్తా చాటుతూ ఈ రోజు హర్రర్, మిస్టరీ థ్రిల్లర్ 'అగధ'  తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రచార చిత్రాలతో క్రేజ్ సంపాదించుకోవడంతో పాటు నిన్న ప్రీమియర్స్ కూడా ప్రదర్శించడంతో థియేటర్స్ హౌస్ ఫుల్స్ తో దర్శనమిచ్చాయి.  మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ
మహాదేవి( కామాక్షి భాస్కర్ల) ఐదేళ్ల చిన్నవయసులోనే తనకి తాను అమ్మవారి రూపంలో కనిపించడంతో పాటు దైవశక్తీ మహాదేవిని కాలినడకన సుదూర ప్రయాణం చేయించి ఒక ప్రాంతంలో ఉండే అమ్మవారి ప్రతిమ దగ్గరకి చేరుస్తుంది. భారీ ఆకారంతో చూడగానే రెండు చేతులు జోడించి నమస్కరించాలనే విధంగా అమ్మవారి రూపం ఉంటుంది.  అప్పట్నుంచి అమ్మవారి ఆరాధికారులుగా ఉంటూ తన దగ్గరికి వచ్చే మనుషులని దుష్ట పీడల నుంచి రక్షిస్తుంది. మహాదేవికి ఆత్మలు, ప్రేతాత్మలు  కూడా కనపడుతుంటారు. అగధ (రూపంలేని ఒక మహా పురుష క్షుద్రశక్తీ). ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ లో ఉండే 'శుక్లా' అనే గ్రామ సరిహద్దులో ఉండే  ఒక దండకారణ్యంలో ప్రేతాత్మలని, తల్లి కడుపులో పురుడు పోసుకుంటున్న జీవులతో కలిసి మహాసామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఈ విధమైన రెండు పార్శ్యాలుతో ఉన్న మహాదేవి, అగధ మధ్య జరిగే కథలో మిగతా క్యారక్టర్ ల కథ ఏంటి? చైత్ర అమావాస్యతో పాటు 144 ఏళ్ళకి వచ్చే క్షుద్రగ్రహణం యొక్క లక్ష్యం ఏంటనేదే అగధ.



ఎనాలసిస్ :

ఓవర్ ఆల్ గా చూసుకుంటే చాలా మంచి కథ..   కలియుగంలో దుష్ట శక్తిని అంతమొందించలేం, అమ్మవారి దగ్గర బంధించగలం అనే కాన్సెప్ట్ నేటి కలియుగానికి కరెక్ట్ గా సరిపోతుంది. ఊరూరా అమ్మవారు ఇందుకే వెలిశారా అనే ఆలోచన  మన మనసులో తడుతుంది. కాకపోతే కొన్ని సీన్స్ బలంగా లేక తేలిపోయాయి. ఆర్టిసుల పరంగా కూడా మైనస్. ఇదే కథలో కామాక్షి భాస్కర్ల లాగా కొంచం పేరెన్నికిగన్న నటీనటులైతే అగధ ఎట్మాస్పియర్ మరోలా ఉండేది. ఎంటర్ టైన్ మెంట్ ని  ని  ఏదో ఒక రకంగా మిక్స్ చేయాల్సింది.

దీనివలన మూవీ మొత్తం మిస్టరీ గా నడపడానికి కావాల్సిన సీన్స్ విషయంలో ఇబ్బంది పడకుండా ఉండేవాళ్లు. ఎందుకంటే మూవీ మొత్తం సీరియస్ గా సాగుతుంది. కాకపోతే  ఏంఎస్ రాజు గారి దర్శకత్వ ప్రతిభ కట్టిపడేస్తుంది. ఫస్ట్ హాఫ్ లో   చూసుకుంటే మహిమ , బబ్లు పై వచ్చిన సీన్ తో మంచి క్యూరియాసిటీ కలుగుతుంది. ఆ తర్వాత వచ్చిన మహాదేవి ఫ్లాష్ బ్యాక్ సీన్ తో కథనంపై చాలా ఎక్కువ అంచనాలు పెట్టుకుంటాం.  కానీ నార్మల్ గా సీన్స్ వచ్చాయి. మహాదేవి క్యారక్టరయిజేషన్ ని, ఆమె పరిష్కరించే సమస్యలని డెప్త్ గా చూపించాల్సింది. మహిమ తండ్రి  భానుచందర్, అండ్ ఫ్యామిలీ పై వచ్చే సీన్స్ పర్లేదు.

ముఖ్యంగా ఇంటర్వెల్ బాంగ్ ముందు వచ్చే ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంది. సెకండ్ హాఫ్ లో కథనం ఫస్ట్ హాఫ్ కంటే వేగంగా నడిచింది. ప్రతి సీన్ ఎక్కడా బోర్ కొట్టలేదు. ముఖ్యంగా హరిణి( జోవికా విజయ్‌కుమార్), సలీం(శ్రవణ్ రెడ్డి) ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంది. ఆ ఇద్దరి క్యారెక్టర్స్ తో అసలు కథ చెప్పడం ప్లస్ పాయింట్. అగధ తన లక్ష్యం చెప్పడంతో పాటు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నాయి. కాకపోతే అగధ లాంటి సబ్జెట్స్ కి ఉండాల్సిన బీభత్సం, హడావిడి కొంచం తక్కువయ్యింది 

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు 
మహాదేవి గా కామాక్షి భాస్కర్ల తన క్యారక్టర్ కి పూర్తి న్యాయం చేసింది. ఆ   క్యారక్టర్ కి సబ్జెక్టుకి తగ్గట్టుగా ప్రశాంతతతో కూడిన ముఖకవళికలు చాలా ముఖ్యం. వాటన్నిటిలో తన సత్తా చాటింది. సింహ, సలీం గా చేసిన శ్రవణ్ రెడ్డి తన రెండు క్యారెక్టర్స్ లో డిఫరెంట్ మాడ్యులేషన్ తో కూడిన పెర్ఫార్మ్ ప్రదర్శించి మెప్పించాడు.  మిగతా క్యారెక్టర్స్ లో చేసిన వాళ్ళందరూ కూడా తమ అద్భుతమైన పెర్ఫార్మ్ తో అగధకి హెల్ప్ అయ్యారు. జోవికా విజయ్ కుమార్ తన కెరీర్ లో గుర్తుండి పోయే పెర్ఫార్మ్ ఇచ్చింది.  ఏం ఎస్ రాజు గారు దర్శకుడిగా సక్సెస్ అవ్వడంతో పాటు టెక్నాలిజీని వాడుకోవడంలో కూడా సక్సెస్ అయ్యారు. రచయితగా బలమైన సీన్స్ రాసుకోలేకపోయారేమో అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా అగధ లాంటి సబ్జెట్స్ కి ఇంకాస్త మెరుపులు కావాలి. ఫొటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్. నిర్మాణ విలువలు పర్లేదు.

బలాలు
- కథ 
- కామాక్షి భాస్కర్ల పెర్ ఫార్మెన్స్ 
- ఇంటర్వెల్ ముందు వచ్చే ఎపిసోడ్ 
- సెకండ్ హాఫ్ 

బలహీనతలు 
- కొన్ని సన్నివేశాల్లో బలం లేకపోవడం 
- రాంగ్ కాస్టింగ్ 



తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

ఇంటర్వెల్ ముందు వచ్చే ఎపిసోడ్, సెకండ్ హాఫ్ పర్వాలేదనే స్థాయిలోనే ఉన్నాయి. నిర్మాణ విలువలు ఇంకొంచం బాగుండి ఉంటే అగధ ఇంకాస్త బెటర్ పొజిషన్ లో ఉండేదేమో.

- అరుణాచలం

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.