![]() |
![]() |

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2 న ఈ మూవీ అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇందులో 'ఏజెంట్' బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్ గా నటించనుందని టాక్ వినిపిస్తోంది.
సురేందర్ రెడ్డి ప్రస్తుతం అఖిల్ అక్కినేని హీరోగా 'ఏజెంట్' అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి.. పవన్ తో సినిమా చేయనున్నారు. అయితే సురేందర్ రెడ్డి.. పవన్ తో చేయబోయే సినిమాలోనూ సాక్షి వైద్యనే హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఈ యంగ్ బ్యూటీ లక్కీ కొట్టేసినట్లే అని చెప్పాలి.
ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ అందించారు.
![]() |
![]() |