Home

»

Gossips

`అధికారి`గా మెగాప‌వ‌ర్ స్టార్!?

May 27, 2022 4:18PM

ఈ ఏడాది `ఆర్ ఆర్ ఆర్`, `ఆచార్య‌`.. ఇలా బ్యాక్ టు బ్యాక్ మ‌ల్టిస్టార‌ర్స్ లో సంద‌డి చేశాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్. వీటిలో యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ తో క‌లిసి న‌టించిన `ఆర్ ఆర్ ఆర్` పాన్ - ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌గా.. త‌న తండ్రి, మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న `ఆచార్య‌` ఆశించిన విజ‌యం సాధించ‌లేక‌పోయింది.

ఇదిలా ఉంటే, చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో ఓ పొలిటిక‌ల్ డ్రామా చేస్తున్నాడు. స్టార్ ప్రొడ్యూస‌ర్ `దిల్` రాజు ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో చ‌ర‌ణ్ కి జంట‌గా కియారా అద్వాని న‌టిస్తుండ‌గా.. శ్రీ‌కాంత్, జ‌య‌రామ్, సునీల్, అంజ‌లి ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ బాణీలు అందిస్తున్నాడు. కాగా, ఈ సినిమాకి `స‌ర్కారోడు` అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్లు గ‌తంలో ప్ర‌చారం జ‌రిగింది. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. `అధికారి` అనే పేరుని కూడా ప్ర‌ముఖంగా ప‌రిశీలిస్తోంద‌ట శంక‌ర్ అండ్ టీమ్. మ‌రి..  చ‌ర‌ణ్ తాజా చిత్రానికి `స‌ర్కారోడు`, `అధికారి`లో ఏ టైటిల్ ఫైన‌లైజ్ అవుతుందో చూడాలి.

కాగా, 2023 వేస‌విలో జ‌నం ముందుకు రానున్న ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా రామ్ చ‌ర‌ణ్ రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com