Home

»

Gossips

చ‌ర‌ణ్ - శంక‌ర్ సినిమాః వామ్మో పాట‌కి, ఫైట్ కి రూ. ప‌దేసి కోట్లా!

Apr 4, 2022 2:43PM

భారీత‌నానికి చిరునామాగా నిలిచిన ద‌ర్శ‌కుల్లో శంక‌ర్ ఒక‌రు. సాంకేతిక‌త‌కు పెద్ద‌పీట వేస్తూ సినిమాలు తీసే ఈ సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్.. ప్ర‌స్తుతం మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో ఓ బిగ్ టికెట్ ఫిల్మ్ రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూస‌ర్ `దిల్` రాజు నిర్మిస్తున్న ఈ పాన్ - ఇండియా మూవీ.. (సోలో హీరోగా) చ‌ర‌ణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతోంద‌ని స‌మాచారం.

ఇదిలా ఉంటే, చ‌ర‌ణ్ - శంక‌ర్ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. త‌న స్థాయికి, అభిరుచికి త‌గ్గ‌ట్టు శంక‌ర్ ఈ చిత్రంలోని ఓ పాట కోసం, ఓ పోరాట ఘ‌ట్టం కోసం భారీ మొత్తాన్నే వెచ్చించార‌ట‌. క‌థానుసారం వ‌చ్చే ఓ పాట కోసం అక్ష‌రాలా రూ. 10 కోట్ల మొత్తం ఖ‌ర్చు చేయించిన‌ శంక‌ర్.. కీల‌కమైన ఓ ఫైట్ సీక్వెన్స్ కోసం కూడా ఇంచుమించు అంతే మొత్తం ఖ‌ర్చు పెట్టించార‌ని బ‌జ్. మ‌రి.. ఈ ప్రచారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.

కాగా, చ‌ర‌ణ్ - శంక‌ర్ కాంబో మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని నాయిక‌గా న‌టిస్తుండ‌గా శ్రీ‌కాంత్, జ‌య‌రామ్, అంజ‌లి, సునీల్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ బాణీలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2023 సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుందని టాక్.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com