Home  »  Gossip  »  పూరికి ప్రభాస్ బ్యానర్ భారీ ఆఫర్?

Updated : Jun 26, 2020

 

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హోమ్ బ్యానర్ నుండి భారీ ఆఫర్ వచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. అయితే, ఈ ఆఫర్ సినిమా కోసం కాదట, వెబ్ సిరీస్ కోసమని టాక్. యువీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ సొంత బ్యానర్ కింద లెక్క. అతడికి ఆ సంస్థ అధినేతలలో ఒకరైన ప్రమోద్ కజిన్. ఇప్పటివరకూ సినిమా ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ చేసిన యువీ క్రియేషన్స్, వెబ్ సిరీస్ ప్రొడక్షన్‌లోకి దిగాలని అనుకుంటున్నదట. అందులో భాగంగా పూరితో ఓ వెబ్ సిరీస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

పూరి జగన్నాథ్‌కి భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడంతో పాటు స్టోరీ-స్క్రిప్ట్, కాస్ట్ అండ్ క్రూ, బడ్జెట్ విషయంలో ఫ్రీ హ్యాండ్ ఇవ్వడానికి యువీ క్రియేషన్స్ రెడీగా ఉందని టాక్. జెట్ స్పీడ్‌లో సినిమాలు తీయడంలో పూరి ఎక్స్‌పర్ట్. ఒకసారి స్టార్ట్ చేస్తే మూడు నెలల్లో కంప్లీట్ చేసి ఇస్తాడు. పూరి తీసిన సిరీస్ అంటే మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంటుంది. మరి, పూరి జగన్నాథ్ ఏమంటాడో? ఈ వార్తలో నిజమెంతో త్వరలో తెలుస్తుంది. మరో స్టార్ డైరెక్ట‌ర్‌ అనిల్ రావిపూడికి ఆహా నుండి వెబ్ సిరీస్ తీయమని ఆఫర్ వచ్చినట్టు వినికిడి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.