![]() |
![]() |

అదేమి చిత్రమో గానీ.. 'మహానటి' వంటి సెన్సేషనల్ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ తరువాత కేరళకుట్టి కీర్తి సురేశ్ నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ ఒకదాని తర్వాత ఒకటిగా ఓటీటీ బాటలోనే పయనిస్తున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ టైమ్ లో థియేటర్స్ మూసివేత కారణంగా కీర్తి నటించిన 'పెంగ్విన్', 'మిస్ ఇండియా' చిత్రాలు ఓటీటీ వేదికల్లో సందడి చేశాయి. ఈ రెండు సినిమాలకు కూడా ఆశించిన స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో.. కీర్తి నటించిన మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ కాబోతోందని ప్రచారం సాగుతోంది.
ఆ వివరాల్లోకి వెళితే.. నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి నటించిన స్పోర్ట్స్ డ్రామా 'గుడ్ లక్ సఖి'. ఈ సినిమాని జూన్ 3న థియేటర్స్ లో రిలీజ్ చేయాలని యూనిట్ భావించింది. అయితే, కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో పాటు 'జీ 5' నుంచి మంచి ఆఫర్ రావడంతో.. 'గుడ్ లక్ సఖి' టీమ్ ఓటీటీ వైపు మొగ్గు చూపిస్తోందట. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ వస్తుందని సమాచారం. మరి.. కీర్తికి ఈ మహిళా ప్రాధాన్య చిత్రమైనా గుర్తింపుని తీసుకువస్తుందేమో చూడాలి.
కాగా, 'గుడ్ లక్ సఖి'లో కీర్తి జోడిగా ఆది పినిశెట్టి నటించగా, కీర్తికి షూటింగ్‌లో ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తిగా జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించారు.
![]() |
![]() |