![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ 'వారణాసి' గురించి ఒక మైండ్ బ్లాకింగ్ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ అడ్వెంచరస్ ఎపిక్‌లోకి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాలో ఎంతో పవర్‌ఫుల్ అండ్ డివైన్ రోల్ అయిన 'హనుమంతుడి' పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నారనే న్యూస్.. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.
గతంలో హనుమంతుడి పాత్ర కోసం వర్సటైల్ యాక్టర్ మాధవన్ పేరు ప్రముఖంగా వినిపించింది. రాజమౌళి విజన్‌కి తగ్గట్టు మాధవన్ లుక్ అండ్ పెర్ఫార్మన్స్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా రామ్ చరణ్ పేరు తెరపైకి రావడంతో.. ఒక్కసారిగా అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి.
'వారణాసి' మూవీలో వచ్చే త్రేతాయుగం ఎపిసోడ్ లో మహేష్ బాబు కాసేపు శ్రీరాముడిగా కనువిందు చేయనున్నారు. ఆ ఎపిసోడ్ లో హనుమంతుడిగా రామ్ చరణ్ నటిస్తే.. ఆ మేనియా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.
'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాతో రామ్ చరణ్‌ను ఆల్రెడీ గ్లోబల్ వైడ్‌గా ప్రొజెక్ట్ చేశారు రాజమౌళి. చరణ్ లోని ఆ ఇంటెన్స్ అండ్ డివైన్ షేడ్స్‌ను.. 'అల్లూరి సీతారామరాజు' పాత్రలో క్లైమాక్స్ వద్ద ఎంతో అద్భుతంగా చూపించారు. అందుకే ఈ హనుమంతుడి క్యారెక్టర్‌కి రామ్ చరణ్ అయితేనే పర్ఫెక్ట్ న్యాయం జరుగుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.
మరి ఇది నిజంగానే రాజమౌళి వేసిన బిగ్గెస్ట్ ప్లానా? లేక కేవలం సోషల్ మీడియాలో షికారు చేస్తున్న రూమరా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఒకవేళ మహేష్ బాబు, రామ్ చరణ్ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించి.. అది కూడా రాజమౌళి మార్క్ మైండ్ బ్లోయింగ్ విజువల్స్‌తో ఉంటే... బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ ఖాయం.
Ram Charan, Hanuman, Varanasi, Mahesh Babu, SS Rajamouli
![]() |