Home  »  Gossip  »  తెలంగాణ నేటివిటీతో రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ.. సుకుమార్ ప్లాన్ మామూలుగా లేదుగా.!

Updated : Jul 10, 2026

'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ రామ్ చరణ్ కెరీర్ లో 17వ సినిమాగా రానుంది. అయితే, ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక సెన్సేషనల్ గాసిప్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌ లో, రూటెడ్ నేటివిటీతో సాగే పవర్‌ఫుల్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనుందని టాక్ వినిపిస్తోంది.

గత కొన్ని కాలంగా తెలుగు సినీ పరిశ్రమలో నేటివిటీ కథలకు, ముఖ్యంగా తెలంగాణ మట్టి వాసనతో కూడిన చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 'బలగం', 'దసరా' వంటి భారీ విజయాలే  అందుకు ఉదాహరణ. 'ఎల్లమ్మ', 'ఇడుపు కాయితం' వంటి సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. గత కొన్నేళ్లలో విడుదలైన ఎన్నో తెలంగాణ బేస్డ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో రికార్డులను సృష్టించాయి. కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా, రా అండ్ రస్టిక్ ఇంటెన్సివ్ కథలకు గ్లోబల్ వైడ్‌గా ఆదరణ పెరుగుతుండటంతో మేకర్స్ కూడా ఇటువైపే మొగ్గు చూపుతున్నారు. సుకుమార్ ఇప్పటికే అల్లు అర్జున్‌తో 'పుష్ప' సిరీస్‌ను ఆంధ్రా-తమిళనాడు సరిహద్దు శేషాచలం అడవుల నేపథ్యంలో ఎంతో క్వాలిటీగా చూపించారు. ఇప్పుడు చరణ్ కోసం ఒక మైండ్ బ్లోయింగ్ తెలంగాణ రూటెడ్ స్టోరీని సిద్ధం చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

సుకుమార్ ప్రతి స్క్రిప్ట్‌పై చాలా సమయం తీసుకుని, ప్రతి పాత్రను ఎంతో సహజంగా మలుస్తారనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన ఈ ప్రాజెక్ట్ కోసం మూడు విభిన్నమైన ఐడియాలను పరిశీలించి, చివరికి ఒక అద్భుతమైన లైన్‌ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ఇటీవల స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'తో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మరోసారి రూరల్ కథలో నటించనున్నారని టాక్. 

ఏదేమైనా చరణ్ మాస్ యాసతో తెలంగాణ నేపథ్యంలో సుక్కు మార్క్ టేకింగ్‌లో వస్తే థియేటర్లు బద్దలైపోవడం గ్యారెంటీ. దీనిపై అధికారిక ప్రకటన కోసం మెగా అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

 

 

Ram Charan, Sukumar, RC17 Movie, Telangana

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.