![]() |
![]() |

అక్కినేని హీరో అఖిల్ (Akhil Akkineni) నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’ (Lenin) ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ జూలై 10న విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అఖిల్ కెరీర్ లోనే ఇది ఒక వైవిధ్యమైన చిత్రంగా నిలుస్తుందని చిత్ర యూనిట్ మొదటి నుండి ఎంతో నమ్మకంగా చెబుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. థియేటర్లలో అక్కినేని అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించే రేంజ్ లో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ని మేకర్స్ ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాలో టాలీవుడ్ కి చెందిన ఒక స్టార్ హీరో పవర్‌ఫుల్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. సినిమా కథను మలుపు తిప్పే కీలకమైన సెకండాఫ్ లో ఈ సర్‌ప్రైజ్ ఎంట్రీ ఉండబోతోందని సమాచారం. దాదాపు 10 నుండి 15 నిమిషాల పాటు సాగే ఈ అతిథి పాత్ర సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని, థియేటర్లలో ఫ్యాన్స్ కి పూనకాలు రావడం ఖాయమని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఈ గెస్ట్ రోల్ కి సంబంధించిన వివరాలను చిత్రబృందం ఎంతో రహస్యంగా ఉంచినప్పటికీ, అక్కినేని అభిమానుల్లో మాత్రం ఈ సర్ప్రైజ్ గెస్ట్ ఎవరై ఉంటారా అనే ఉత్కంఠ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ ఒక్క ఎలిమెంట్ సినిమా రేంజ్ ని మార్చేస్తుందని ట్రేడ్ వర్గాలు సైతం భావిస్తున్నాయి.
మరోవైపు ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేయబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా అఖిల్-భాగ్యశ్రీ మధ్య వచ్చే లవ్ సీన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా యూత్ ని ఆకట్టుకునే లవ్ ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయట. సినిమా ఫైనల్ అవుట్‌పుట్‌పై చిత్రబృందం పూర్తి నమ్మకంతో ఉన్నారు. మరి ఈ పవర్‌ఫుల్ సర్‌ప్రైజ్ ఎలిమెంట్ తో అఖిల్ అక్కినేని ఈసారి బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ దక్కించుకుంటాడేమో చూడాలి.
![]() |
![]() |