Home  »  Gossip  »  ప్రభాస్ డైరెక్టర్‌తో జతకట్టనున్న రవితేజ.. మారుతీతో మాస్ రాజా నెక్స్ట్ మూవీ!

Updated : Jun 22, 2026

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద జాతర చేయడం ఆయన నైజం. ప్రస్తుతం రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక చిత్రం 'ఇరుముడి' (Irumudi) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ఎమోషనల్ అండ్ డివోషనల్ డ్రామాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా ఆగస్టు 21న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్‌పై ఉండగానే మాస్ రాజా తన నెక్స్ట్ మూవీ లైనప్‌ను మరింత పవర్‌ఫుల్‌గా సెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫిలిం నగర్ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం, 'ఇరుముడి' తర్వాత రవితేజ డైరెక్టర్ మారుతీ(Maruthi)తో జతకట్టబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.

మారుతీ ఈ ఏడాది రెబల్ స్టార్ ప్రభాస్‌తో తెరకెక్కించిన భారీ హర్రర్ కామెడీ చిత్రం 'రాజాసాబ్' 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. 'రాజాసాబ్' తర్వాత మారుతీ తన నెక్స్ట్ మూవీ ఏ హీరోతో చేస్తాడనే ఆసక్తి నెలకొని ఉంది. అయితే మారుతీ ఇటీవల రవితేజకు ఒక అదిరిపోయే పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ లైన్‌ను వినిపించారట. మారుతీ మార్క్ కామెడీ టైమింగ్, రవితేజ బాడీ లాంగ్వేజ్ అండ్ మాస్ ఎనర్జీకి సరిగ్గా సరిపోయేలా ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ అండ్ యాక్షన్ స్క్రిప్ట్ ఉండబోతోందని టాక్. నిజానికి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావాలని గత 3, 4 ఏళ్లుగా చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇద్దరి బిజీ షెడ్యూల్స్ వల్ల కుదరలేదు. ఇప్పుడు ఇద్దరికీ సరైన సమయం దొరకడంతో ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్‌తో పాటు రవితేజ లైనప్‌లో మరికొన్ని క్రేజీ కాంబినేషన్లు కూడా లైన్లో ఉన్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో హాసిత్ గోలి దర్శకత్వంలో ఒక సినిమాతో పాటు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వివేక్ ఆత్రేయతో మరో సినిమా చర్చల దశలో ఉన్నాయి. అలాగే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరి కూడా రవితేజ కోసం ఒక పవర్‌ఫుల్ మాస్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు సమాచారం. ఏదేమైనా 'ఇరుముడి' తర్వాత మారుతీ దర్శకత్వంలో రాబోయే సినిమా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మారుతీ మార్క్ కామెడీ టైమింగ్, రవితేజ ఎనర్జీ తోడైతే థియేటర్లలో నవ్వుల జాతర గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఖుషీ అవుతున్నారు.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.