![]() |

- 'వారణాసి'లో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్?
- శివుడి పాత్రలో కనిపించనున్న గ్రీక్ గాడ్!
- మహేష్ ఫ్యాన్స్ లో మొదలైన టెన్షన్!
- రాజమౌళి రిస్క్ చేస్తున్నారా?
మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ 'వారణాసి' (Varanasi). ప్రస్తుతం ఇండియన్ సినిమాలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ ఇది. గ్లోబ్‌ట్రాటర్ థీమ్‌తో సాగే ఈ సినిమా గురించి ప్రతి రోజూ ఒక కొత్త వార్త హల్చల్ చేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒక రూమర్ ఇటు మహేశ్ ఫ్యాన్స్‌ను, అటు సినీ లవర్స్ ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదేంటంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) శివుడి పాత్రలో కనిపించబోతున్నారట.
రాముడిగా మహేష్!
వారణాసి సినిమా కేవలం ఒక జంగిల్ అడ్వెంచర్ మాత్రమే కాదు.. ఇందులో పురాణాలు, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ ఎలిమెంట్స్ కూడా ఉండనున్నాయి. త్రేతాయుగం నాటి రహస్యాలను ఛేదించే క్రమంలో హీరో వారణాసి నుంచి ఆఫ్రికా అడవుల వరకు ప్రయాణిస్తాడని టాక్. ఇందులో మహేశ్ బాబు 'రుద్ర' అనే పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలై ఆకట్టుకుంది. అలాగే, శ్రీరాముడి పాత్రలోనూ మహేష్ కనువిందు చేయనున్నారు. రాముడిగా మహేష్ ని తెరపై చూడటం కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
శివుడిగా హృతిక్?
'వారణాసి'లో రాముడిగా మహేష్ కనిపించనున్నారని ఇప్పటికే అధికారికంగా తెలియగా.. ఇప్పుడు శివుడిగా హృతిక్ కనిపిస్తారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి లాంటి దర్శకుడు తన సినిమాలో ప్రత్యేక పాత్ర కోసం మరో స్టార్ హీరోను పెడుతున్నారంటే అది మామూలు విషయం కాదు. అయితే అది శివుడి పాత్ర కావడంతో.. ఒక స్టార్ చేస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో హృతిక్‌ను సంప్రదించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు అభిమానులు ఇప్పటికే కొన్ని ఫోటోలు కూడా వైరల్ చేస్తున్నారు. వారణాసి ఘాట్ల నేపథ్యంలో హృతిక్ రోషన్ శివుడి వేషధారణలో ఉన్న ఏఐ ఫోటోలు, ఫ్యాన్ ఆర్ట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రాజమౌళి మళ్ళీ ఆ రిస్క్ చేస్తారా?
గతంలో 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఇద్దరు టాప్ స్టార్లను బ్యాలెన్స్ చేయడంలో రాజమౌళి సక్సెస్ అయ్యారు. కానీ, ఆ తర్వాత ఇద్దరు హీరోల అభిమానుల మధ్య జరిగిన క్రెడిట్ వార్, సోషల్ మీడియా గొడవలు అందరికీ తెలిసిందే. ఇప్పుడు 'వారణాసి' పూర్తిగా మహేశ్ బాబు చుట్టూ తిరిగే కథ. ఇందులో హృతిక్ లాంటి భారీ స్టార్ ఇమేజ్ ఉన్న నటుడు కనిపిస్తే.. మళ్ళీ క్రెడిట్ వార్ జరుగుతుందా? అన్న ఆందోళన అభిమానుల్లో నెలకొంది.
హృతిక్ రోషన్ రాకపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. రాజమౌళి తన సినిమాల విషయంలో అత్యంత గోప్యత పాటిస్తారు కాబట్టి.. ఇది కేవలం రూమర్ గానే మిగిలిపోతుందా లేక థియేటర్లో బాంబు పేలుస్తారా అనేది చూడాలి. ఏదేమైనా, హృతిక్ శివుడిగా కనిపిస్తే మాత్రం అది ఇండియన్ స్క్రీన్ పై ఒక విజువల్ వండర్ అవుతుందనడంలో సందేహం లేదు.
![]() |