Home  »  Gossip  »  Anupama Parameswaran: ఆ స్టార్ హీరో కొడుకుతో అనుపమ పరమేశ్వరన్ పెళ్లి!

Updated : Apr 8, 2026

టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న పెళ్లి పీటలెక్కారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ క్రమంలోనే మలయాళ ముద్దుగుమ్మ, ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) పెళ్లి గురించి వస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

మలయాళ సినిమా 'ప్రేమమ్'తో కేరళ కుట్టిగా పరిచయమై, 'అఆ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘అనసూయ’గా ముద్ర వేసుకున్న భామ అనుపమ. హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈమె, రీసెంట్‌గా గ్లామర్ పాత్రలతోనూ మెప్పిస్తోంది. అయితే, కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్న అనుపమ.. ఒక స్టార్ హీరో కొడుకుతో ఏడడుగులు వేయడానికి రెడీ అవుతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది.

గత కొద్ది రోజులుగా అనుపమ పెళ్లి గురించి మలయాళ మీడియాలో కథనాలు హోరెత్తుతున్నాయి. త్వరలోనే వివాహం చేసుకోబోతోందని, వచ్చే నెలలోనే నిశ్చితార్థ వేడుక జరగనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఆ హీరోతోనేనా?
అనుపమ ఎవరిని పెళ్లి చేసుకోబోతోంది అనే విషయంపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆమె సినీ రంగానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తిని వివాహం చేసుకోబోతోందని సమాచారం. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ విక్రమ్ తనయుడు, యువ హీరో ధ్రువ్ విక్రమ్(Dhruv Vikram) పేరు ఎక్కువగా వినిపిస్తోంది. వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని, వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపాయనేది తాజా టాక్. అయితే ఈ విషయంలో అటు అనుపమ గానీ, ఇటు ధ్రువ్ విక్రమ్ గానీ అధికారికంగా స్పందించలేదు.

క్లారిటీ రావాల్సి ఉంది!
సినిమా రంగంలో సెలబ్రిటీల పెళ్లి వార్తలు రావడం చాలా సహజం. గతంలోనూ అనుపమ పెళ్లి గురించి రకరకాల రూమర్స్ వచ్చాయి. మరి తాజా వార్తల్లో నిజమెంత? ఆమె నిజంగానే పెళ్లి పీటలెక్కబోతోందా? లేక ఇవన్నీ కేవలం గాసిప్స్ మాత్రమేనా? అనేది తెలియాలంటే అనుపమ స్వయంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.