![]() |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ప్రభాస్ గురించి టాలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ చక్కర్లు కొడుతోంది. 'మహాకాళి'(Mahakali) సినిమాలో ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సృష్టించిన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) రోజురోజుకూ విస్తరిస్తోంది. ‘హను-మాన్’ విజయం తర్వాత యూనివర్స్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ‘మహాకాళి’ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ప్రభాస్ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఈ వార్త విన్నప్పటి నుంచి రెబల్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఫిమేల్ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో వస్తున్న ‘మహాకాళి’ చిత్రానికి పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తుండగా, ప్రశాంత్ వర్మ స్వయంగా కథను అందించాడు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నాడట. ఇది కేవలం ఒక అతిథి పాత్ర మాత్రమే కాకుండా, ఈ యూనివర్స్ లో రాబోయే పెద్ద సినిమాలకు పునాదిలా ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించి ప్రభాస్ ఇప్పటికే తన వంతు షూటింగ్‌ను కూడా పూర్తి చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా న్యూస్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో కన్నడ నటి భూమి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 100 రోజుల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రభాస్ వంటి స్టార్ హీరో ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం వల్ల ‘మహాకాళి’కి పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు లభించడం ఖాయమని చెప్పవచ్చు.
ప్రభాస్ గతంలో ‘కన్నప్ప’ వంటి చిత్రాల్లో కూడా ఇలాగే స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’ (Fauzi), ‘స్పిరిట్’ (Spirit) వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
![]() |