Home

»

Gossips

'మానాడు' రీమేక్ లో రానా తమ్ముడు!

Jan 17, 2022 4:56PM

కోలీవుడ్ స్టార్ శింబు, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'మానాడు'. టైమ్‌ లూప్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా నవంబర్ 25న విడుదలై.. సంచలన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రీమేక్ కి సంబంధించి ఓ ఆసక్తికరమైన న్యూస్ వినిపిస్తోంది.

'మానాడు' తెలుగు రీమేక్ లో సురేష్ బాబు తనయుడు హీరో రానా నటిస్తాడని వార్తలొచ్చాయి. ఆ తర్వాత రవితేజ పేరు కూడా వినిపించింది. అయితే ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది. సురేష్ బాబు రెండో కొడుకు, రానా తమ్ముడు అభిరామ్ 'మానాడు' రీమేక్ లో హీరోగా నటించనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే దర్శకుడితో పాటు ఇతర వివరాలను ప్రకటించనున్నారని సమాచారం.

ఇప్పటికే తేజ దర్శకత్వంలో అభిరామ్‌ హీరోగా తన మొదటి సినిమా చేస్తున్నాడు. అభిరామ్ రెండో సినిమాగా మానాడు రీమేక్ రానుందని ప్రచారం జరుగుతోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com