![]() |
![]() |

రవితేజ, శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. అలాంటిది ఈ ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే.. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురవడం ఖాయం.
ఓ కామెడీ ఎంటర్‌టైనర్ కోసం రవితేజ, శ్రీవిష్ణు చేతులు కలపనున్నారు. ఈ మల్టీస్టారర్ కు హసిత్ గోలి దర్శకత్వం వహించనున్నారు. 'రాజ రాజ చోర', 'స్వాగ్' వంటి చిత్రాలతో ఆకట్టుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి.. ఈ ఇద్దరు హీరోల కోసం ఒక హిలేరియస్ ఫన్ రైడ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు వినికిడి.
ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపుదిద్దుకోనుందట. ఇక ఈ సినిమాకి 'వీరాధి వీరులు కేరాఫ్ మహిళా మండలి' అనే డిఫరెంట్ అండ్ క్యాచీ టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. టైటిల్ వింటుంటేనే కడుపుబ్బా నవ్వించే ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ డ్రామా మన ముందుకు రాబోతోందని స్పష్టమవుతోంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ థియేటర్లకు రప్పించేలా 2027 సంక్రాంతి రేసులో నిలపాలని మేకర్స్ పక్కా స్కెచ్ వేస్తున్నారు. రవితేజ, శ్రీవిష్ణు కలిస్తే 2027 సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర నవ్వుల జాతరే అని చెప్పొచ్చు.
Ravi Teja, Sree Vishnu, Multistarrer, Hasith Goli
![]() |
![]() |