Home  »  Gossip  »  ఊహించని లేడీ విలన్ ని సెట్ చేసారా..ప్రెజెంట్ అదిరిపోయే హీరోయిన్ కదా!

Updated : Jul 20, 2026

 


రికార్డులే లక్ష్యంగా గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(koratala siva)మూవీ తెరకెక్కబోతుందనే  విషయం తెలిసిందే.  అధికారకంగా లాంచ్ అయిన  ఈ మూవీ గురించి  అభిమానుల్లో, మూవీ లవర్స్ లో అయితే రోజు డిస్కర్షన్ జరుగుతూనే ఉందంటే ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ ని అర్ధం చేసుకోవచ్చు. NBK 112 గా పిలవబడుతున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి  రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర న్యూస్ హల్ చల్ చేస్తుంది.


తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాలని  గెలుచుకున్న ఐశ్వర్య రాజేష్NBK 112 లో  కీలక రోల్ లో కనిపించబోతున్నట్టు  సమాచారం.  సాధారణంగా సినిమాల్లో హీరోయిన్ పాత్రలకే పరిమితమయ్యే భామలు నెగిటివ్ షేడ్స్ వైపు చూడటం చాలా అరుదు. కానీ ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ కేవలం ఒక గ్లామర్ డాల్ లాగానో లేదా సాధారణ హీరోయిన్‌గానో కాకుండా, కథను పూర్తిగా మలుపు తిప్పే ఒక పవర్‌ఫుల్ లేడీ విలన్ రోల్‌లో కనిపించనుందని టాక్. కొరటాల శివ మార్క్ సినిమాల్లో సామాజిక అంశాలతో పాటు పాత్రల మధ్య ఉండే బలమైన ఘర్షణ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో కూడా బాలకృష్ణ పాత్రతో తలపడేలా, కథలో 100 శాతం ప్రాధాన్యత ఉండేలా ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్‌ని కొరటాల శివ అత్యంత పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.  దీంతో బాలయ్య నటనలోని రౌద్ర రసానికి, ఐశ్వర్య రాజేష్ చూపించే నెగిటివ్ షేడ్స్ తోడైతే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.  


also read: నేషనల్ అవార్డు రాగానే ఆ మూవీ కోసం నెటిజన్స్ వెతుకులాట..ఎంతైనా ప్రేక్షకులు కదా!


ఐశ్వర్య రాజేష్ ఇప్పటివరకు తన కెరీర్‌లో ఎన్నో విలక్షణమైన రోల్స్ పోషిస్తూ వస్తుంది. అలాంటిది ఐశ్వర్యకి ఒక పవర్‌ఫుల్ నెగిటివ్ రోల్ చేయడం ఇదే మొదటిసారి కానుంది. గతంలో ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు 'నరసింహ' సినిమాలో రమ్యకృష్ణ చేసిన 'నీలాంబరి' లాంటి పవర్‌ఫుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు లేదా సైకో క్యారెక్టర్లు చేయాలని బలంగా ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. సరిగ్గా ఇప్పుడు కొరటాల శివ అలాంటి ఒక డ్రీమ్ రోల్‌ని  ఆఫర్ చేసినట్లు వార్తలు రావడం చూస్తుంటే, ఐశ్వర్య ఆశ నెరవేరేలా కనిపిస్తోంది. కాకపోతే ప్రస్థుతానికి అయితే ఈ న్యూస్ రూమర్ హోదాలో హల్ చల్ చేస్తుంది.   

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.