Home  »  Gossip  »  వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులని ఆ అగ్ర నిర్మాత ఎంత అమౌంట్ కి అడిగాడో తెలుసా!   

Updated : Jul 15, 2026

 

విజయాలే తన లక్ష్యంగా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నాని 'ది ప్యారడైజ్' షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. 'దసరా' వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్‌లో ప్యారడైజ్' తెరకెక్కతుండటంతో అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. ప్రచార చిత్రాలతో అయితే సెల్యులాయిడ్ పై సరికొత్త ప్రపంచం కనిపించడం ఖాయమనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఉంది. 

తాజాగా ఈ సినిమా బిజినెస్ వర్గాల నుంచి ఒక సెన్సేషనల్ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు 'ది ప్యారడైజ్' ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులని సొంతం చేసుకోవడం కోసం  110 కోట్ల భారీ ఆఫర్‌ని  మేకర్స్ ముందు ఉంచినట్లు టాక్ నడుస్తోంది. ఈ న్యూస్ నిజమైతే నాని కెరీర్‌లోనే అత్యంత భారీ థియేట్రికల్ డీల్ అని చెప్పాలి. 


Also read: నన్ను తిట్టారు,కొట్టారు, తన్నారు.. కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్

'ప్యారడైజ్' ని మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ ఇప్పటికే అనుకున్న అంచనాలను దాటి ఏకంగా 160 కోట్ల మార్కు  తాకినట్లు టాలీవుడ్ ఇన్‌సైడర్స్ సమాచారం.దీంతో నాని కెరీర్‌లోనే ఇదే అత్యంత ఖరీదైన చిత్రంగా నిలవనుంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అసిరియా, గ్లోబల్ మార్కెట్‌ని  టార్గెట్ చేస్తూ చేస్తున్న ఈ ప్రయత్నం ట్రేడ్ వర్గాలని  విస్మయానికి గురిచేస్తోంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండగా ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి    నిర్మిస్తున్నాడు.

nani, the paradise, dil raju, srikanth odela

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.