![]() |
![]() |

న్యాచురల్ స్టార్ నాని ఎప్పుడూ కొత్త దర్శకులను, వినూత్నమైన కథలను ప్రోత్సహించడంలో ముందుంటారు. స్క్రిప్ట్ విషయంలో నానికి ఉన్న మంచి అవగాహన, మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్న దర్శకులను వెతకడంలో అతనికి ఎంతో సహాయపడుతుంది. తాజాగా, ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతోంది. అదేమిటంటే, 'లెనిన్' సినిమా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరును హీరో నాని సంప్రదించినట్లు సమాచారం.
దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు గురించి చెప్పాలంటే, ఆయన మొదటి సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'. ఆ సినిమాతో దర్శకుడిగా ప్రతిభను చాటుకున్న మురళీ కిషోర్ కు.. ఏకంగా అన్నపూర్ణ స్టూడియోస్ అఖిల్ ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. అలా వచ్చిన ప్రాజెక్టే 'లెనిన్'. ఒక భారీ కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కి.. ఈ సినిమా ఎంతో ఊరటనిచ్చింది. అలాగే, దర్శకుడిగా మురళీ కిషోర్ ప్రతిభపై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి. దీంతో పలువురు హీరోలు, నిర్మాతలు ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
నాని కూడా మంచి కథ ఉంటే చెప్పమని దర్శకుడు మురళీ కిషోర్ ను కోరినట్లు తెలుస్తోంది. నాని ప్రస్తుతం 'ది ప్యారడైజ్' సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత 'బ్లడీ రోమియో' లైన్ లో ఉంది. మురళీ కిషోర్ మంచి కథతో మెప్పిస్తే.. నాని తదుపరి ప్రాజెక్ట్ ఇదే అయ్యే అవకాశముంది. ఏదేమైనా, ఈ ఇద్దరి కలయిక గురించి వినిపిస్తున్న ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.
Lenin Movie, Murali Kishore Abburu, Nani, TeluguOne
![]() |
![]() |