Home  »  Gossip  »  Chiranjeevi: చిరంజీవి, నాగార్జున మల్టీస్టారర్? పూర్తి డిటైల్స్ ఇవే! 

Updated : Jul 7, 2026

 

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi),కింగ్  నాగార్జున(Nagarjuna).. తెలుగు సినీ రంగాన్ని ఏలిన, ఏలుతున్న హీరోలు.   ఈ ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నారనే రూమర్స్ ఫిలింనగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. దీంతో రూమర్ అయినా సరే న్యూస్ మాత్రం మెగా అభిమానులకి, అక్కినేని అభిమానులకి పూనకాలు తెప్పిస్తోంది. 

 ఒక ప్రముఖ స్టార్ డైరెక్టర్ ఈ ఇద్దరికి సంబంధించిన స్క్రిప్ట్‌ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా కథాంశం ఇద్దరు మెచ్యూర్డ్ వ్యక్తుల మధ్య జరిగే మైండ్ గేమ్స్, ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుందట. చిరంజీవి మాస్ ఇమేజ్‌కు, నాగార్జున క్లాస్ అండ్ స్టైలిష్ లుక్‌కు సరిగ్గా సరిపోయేలా ఈ క్యారెక్టర్స్ ని  డిజైన్ చేశారని టాక్. టాలీవుడ్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక నిర్మాణ సంస్థ దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి ప్లాన్ చేస్తోందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. ఈ చిత్రంలో ఇద్దరు హీరోలకూ సమానమైన ప్రాధాన్యత, స్క్రీన్ టైమ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారట. ఏ ఒక్కరి క్యారక్టర్ తగ్గినా అభిమానులు నిరాశ చెందుతారు కాబట్టి, ఇద్దరికీ 50-50 బ్యాలెన్స్ కుదిరేలా డైరెక్టర్ స్క్రిప్ట్‌ని  పక్కాగా లాక్ చేశారని సమాచారం.

Also read: Lenin: రిలీజ్ కి ముందే 34 కోట్లు వసూలు చేసిన లెనిన్ . దట్ ఈజ్ అఖిల్ 

ఈ క్రేజీ మల్టీస్టారర్ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా సౌత్ ఇండియా వ్యాప్తంగా ఈ కాంబినేషన్ క్రేజ్ సంపాదిస్తోంది. ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రకారం, ఈ సినిమా గనుక అధికారికంగా ప్రకటిస్తే, కేవలం థియేట్రికల్ హక్కుల ద్వారానే 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉంది డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో మరో 100 కోట్ల వరకు ఆదాయం వచ్చే వీలుంది. అంటే సినిమా షూటింగ్ మొదలుకాకముందే 250 కోట్ల టర్నోవర్ క్లియర్ గా కనిపిస్తోంది. గతంలో చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమాలో సల్మాన్ ఖాన్, 'ఆచార్య'లో రామ్ చరణ్ కనిపించినప్పటికీ, నాగార్జున లాంటి సమకాలీన స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి అవుతుంది. అటు నాగార్జున కూడా రీసెంట్‌గా మల్టీస్టారర్ కథలపై ఆసక్తి చూపిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యే అవకాశాలు 90 శాతం వరకు ఉన్నాయని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారు. త్వరలోనే ఈ మెగా-అక్కినేని కాంబోపై ఒక అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది, అప్పటివరకు ఈ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. 

chiranjeevi, nagarjuna






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.