Home  »  Gossip  »  దుల్కర్‌ని భయపెట్టిన వై.ఎస్‌.జగన్‌?

Updated : Sep 8, 2023

మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి నటుడిగా ఉన్నత శిఖరాలను అందుకున్నారు. ఆయన కెరీర్‌లో చేయని పాత్ర లేదు. మలయాళంలోనే కాదు, ఇతర భాషల్లో కూడా ఆయనకి ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇప్పుడు ఆయన తనయుడు దుల్కర్‌ సల్మాన్‌ కూడా విభిన్నమైన క్యారెక్టర్లు, విభిన్నమైన సినిమాలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. మలయాళంతోపాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్న దుల్కర్‌ డబ్బింగ్‌ సినిమాలతోనే కాదు స్ట్రెయిట్‌ తెలుగు సినిమాలతోనూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. 
ఇప్పుడు దుల్కర్‌ చేస్తున్న సినిమాల కంటే ముందే ఓ సినిమా చేసే అవకాశం వచ్చింది. అదే ‘యాత్ర2’. 2019లో వై.యస్‌.రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా రూపొందించిన ‘యాత్ర’ చిత్రంలో వైఎస్‌ఆర్‌గా మమ్ముటి నటించారు. వైఎస్‌ఆర్‌ పాత్రలో మమ్ముట్టి జీవించారు. ఈ సినిమా వై.ఎస్‌.జగన్‌ విజయానికి కారణమైంది. ఇప్పుడు 2024 ఎన్నికల నేపథ్యంలో మహి వి.రాఘవ్‌ దర్శకత్వంలో ‘యాత్ర 2’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వైఎస్‌ఆర్‌, జగన్‌ మధ్య ఉన్న అనుబంధాన్ని చూపించనున్నారు. మొదట ఈ సినిమాలో వై.ఎస్‌.జగన్‌ పాత్రకు దుల్కర్‌ సల్మాన్‌ని అనుకున్నారట. తండ్రి మమ్ముట్టి వైఎస్‌ఆర్‌గా నటించారు కాబట్టి తనయుడు దుల్కర్‌ అయితే జగన్‌ పాత్రకు బాగుంటాడని భావించిన దర్శకుడు దుల్కర్‌ని  ‘యాత్ర 2’ గురించి చెప్పారట. కానీ, దుల్కర్‌ ఆ సినిమా చేయడానికి విముఖత చూపించారని తెలిసింది. తాను వై.ఎస్‌.జగన్‌ పాత్ర పోషించడం వల్ల పొలిటికల్‌గా ఇబ్బందులు వస్తాయని, అది తన సినిమా కెరీర్‌ని దెబ్బ తీస్తుందని భావించిన దుల్కర్‌ ఆ ఆఫర్‌ తిరస్కరించాడట. దీంతో జగన్‌ పాత్ర కోసం జీవాని ఫిక్స్‌ చేసుకున్నారు. 
 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.