మెగా ఫ్యామిలీతో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కి మంచి అనుబంధముంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమాలో సల్మాన్ కీ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కూడా సల్మాన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. సల్మాన్ నెక్స్ట్ మూవీలో చరణ్ మెరవనున్నాడని సమాచారం.
సల్మాన్ ప్రస్తుతం 'కబీ ఈద్ కబీ దివాలీ' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్స్ వెంకటేష్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ రూపంలో ఈ సినిమాకి మరో స్పెషల్ అట్రాక్షన్ తోడైనట్లు తెలుస్తోంది. ఈ మూవీలో చరణ్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడని, ఓ సాంగ్ లో సల్మాన్ తో కలిసి చిందేయనున్నాడని టాక్.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్'తో చరణ్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో చరణ్ గెస్ట్ రోల్ పోషించడం 'కబీ ఈద్ కబీ దివాలీ'కి ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. ముఖ్యంగా ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులలో ఆసక్తి పెరుగుతుంది.