![]() |
![]() |

మాలీవుడ్ లో వెర్సటైల్ యాక్టర్ గా రాణిస్తున్న ఫహద్ ఫాజిల్.. `పుష్ప`తో తెలుగులో నేరుగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ఫహద్ ప్రతినాయకుడి వేషంలో దర్శనమివ్వనున్నారు. చాన్నాళ్ళ క్రితమే ఫహద్ ఎంట్రీపై ప్రకటన వచ్చినప్పటికీ.. ఓనమ్ రోజున షూట్ లో తొలిసారిగా పాల్గొన్నారు ఫహద్.
ఇదిలా ఉంటే.. రెండు భాగాలుగా రూపొందుతున్న పాన్ - ఇండియా ప్రాజెక్ట్ `పుష్ప`లో ఫహద్ పాత్రకు సంబంధించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. ఇందులో చిత్తూరు జిల్లాలో పనిచేసే నార్త్ ఇండియన్ పోలీసాఫీసర్ గా ఫహద్ కనిపిస్తారట. అంతేకాదు.. ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో తన పాత్ర ఎంట్రీ ఇస్తుందని.. రెండో భాగంలో మాత్రం పూర్తి స్థాయి పాత్రని సమాచారం. అలాగే, బన్నీని ఢీ కొట్టే సన్నివేశాలన్నీ కూడా సెకండ్ పార్ట్ లోనే ఉంటాయని వినికిడి. అదేవిధంగా.. సినిమా మొత్తం గుండుతో కనిపిస్తారని బజ్. మరి.. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, `పుష్ప` ఫస్ట్ పార్ట్ `పుష్ప - ద రైజ్` క్రిస్మస్ కానుకగా థియేటర్స్ లో సందడి చేయనుంది. సెకండ్ పార్ట్ 2022లో రిలీజ్ కానుంది.
![]() |
![]() |