![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'సర్కారు వారి పాట'. బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్షిక కుంభకోణాల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
'సర్కారు వారి పాట' మూవీలో అర్జున్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. గతంలో అర్జున్ పోలీస్ ఆఫీసర్ గా పలు సినిమాలలో నటించి మెప్పించారు. ఇప్పుడు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అర్జున్ కనిపించి.. అంతే పవర్ ఫుల్ గా మహేష్-అర్జున్ ల మధ్య సీన్స్ పడితే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి.
మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా దుబాయ్ లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. త్వరలో కొత్త షెడ్యూల్ మొదలవబోతోంది. ఈ సినిమా 2022 సంక్రాంతికి విడుదల కానుంది.
![]() |
![]() |