![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ పరిస్థితులు చక్కబడిన తరువాత మళ్ళీ ప్రారంభం కానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ మూవీలో పవన్ త్రిపాత్రాభినయం చేయనున్నారని సమాచారం.
హరిహర వీరమల్లు లో పవన్ క్యారెక్టర్ గురించి క్రేజీ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో పవన్ 'వీరమల్లు' అనే వజ్రాల దొంగ పాత్రలో కనిపించనున్నారట. కథాపరంగా ఆయన మరో రెండు డిఫరెంట్ లుక్స్ లో కూడా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్స్ ను డైరెక్టర్ క్రిష్ అద్భుతంగా డిజైన్ చేశారని అంటున్నారు. ఈ వార్త నిజమైతే పవన్ ట్రిపుల్ రోల్ చేసిన తొలి చిత్రం ఇదే కానుంది.
కాగా, ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే పలువురు బాలీవుడ్ నటీనటులు కూడా ఈ మూవీలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.
![]() |
![]() |