Home

»

Gossips

మెగాస్టార్ సరసన సోనాక్షి సిన్హా!!

Jun 23, 2021 8:56PM

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మెహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్‌, మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ తో పాటు.. బాబీ డైరెక్షన్‌ లో ఓ సినిమాను చేయనున్నారు.

చిరు-బాబీ కాంబినేషన్‌ లో రానున్న మూవీ గురించి ఇప్పుడొక క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌ గా బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా నటిస్తోందని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన సోనాక్షి అయితే బాగుంటుందని భావించిన బాబీ.. ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నాడని అంటున్నారు. ఈ వార్త కనుక నిజమైతే.. సోనాక్షి సిన్హా కు టాలీవుడ్‌ లో గ్రాండ్ ఎంట్రీ లభించినట్లే.

ఇక ఈ మూవీలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి విలన్‌ గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే మరికొందరు ప్రముఖ నటులు కూడా ఈ సినిమాలో నటించే అవకాశముందని తెలుస్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com