![]() |
![]() |

మహేష్ బాబుని శ్రీరాముడి పాత్రలో చూసుకోవాలనేది అభిమానుల కోరిక. ఆ అందం, ఆ పర్సనాలిటీకి రాముడి పాత్రలో ఆయన సరిగ్గా సరిపోతారని.. అభిమానులతో పాటు అందరూ భావిస్తుంటారు. ఇటీవల 'మిరాయ్'లో రాముడిగా మహేష్ కనిపిస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ, ఆ వార్తల్లో నిజం లేదని టీం క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పుడు మరో సంచలన వార్త తెరపైకి వచ్చింది. మహేష్ ని రాముడిగా చూపించే బాధ్యతను ఎస్.ఎస్. రాజమౌళి తీసుకున్నారని తెలుస్తోంది. (Mahesh Babu)
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ని కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. భారతీయ పురాణాల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని గతంలో ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు శ్రీరాముడిగా మహేష్ కనిపించబోతున్నారనే న్యూస్ బలంగా వినిపిస్తోంది. అంతేకాదు, ఇప్పటికే దీనికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయిందని వినికిడి. రాజమౌళికి పర్ఫెక్షనిస్ట్ గా పేరుంది. అలాంటి దర్శకుడు రాముడిగా మహేష్ ని ఏ స్థాయిలో చూపిస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది. (SS Rajamouli)
మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి 'SSMB29' అనేది వర్కింగ్ టైటిల్. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఎక్కువ భాగం షూటింగ్ కెన్యాలో జరగనుంది. ఫస్ట్ లుక్ నవంబర్ లో విడుదల కానుంది. సినిమాని 2027 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
![]() |
![]() |