`రొమాంటిక్` చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది కేతికా శర్మ. ఆ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకోలేకపోయినా.. తన గ్లామర్ తో కుర్రకారుని ఫిదా చేసింది. ఆపై `లక్ష్య`లో దర్శనమిచ్చిన ఈ హాట్ బ్యూటీ.. త్వరలో మెగా యంగ్ సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ కి జంటగా `రంగ రంగ వైభవంగా`తో అదృష్టం పరీక్షించుకోనుంది. జూలై 1న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ జనం ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే, తాజాగా మరో మెగా క్యాంప్ మూవీలో సందడి చేసే ఛాన్స్ దక్కించుకుందట కేతికా శర్మ. అది కూడా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రంలో. ఆ వివరాల్లోకి వెళితే.. తమిళ చిత్రం `వినోదయ సిత్తమ్` ఆధారంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, `సుప్రీమ్` హీరో సాయితేజ్ కాంబోలో ఓ మల్టిస్టారర్ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా కోసమే సాయితేజ్ జోడీగా కేతికా శర్మని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. త్వరలోనే పవన్, సాయితేజ్ కాంబినేషన్ మూవీలో కేతికా శర్మ ఎంట్రీపై క్లారిటీ రానుంది. మరి.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కేతికా శర్మ కెరీర్ కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.