Home

»

Gossips

చైతూతో `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్ రొమాంటిక్ డ్రామా!?

May 24, 2022 3:05PM

రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్స్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన ద‌ర్శ‌కుల్లో భాస్క‌ర్ ఒక‌రు. తొలి చిత్రం `బొమ్మ‌రిల్లు` నుంచి గ‌త సినిమా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` వ‌ర‌కు ఇదే శైలిని కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు భాస్క‌ర్.

ఇదిలా ఉంటే, `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్ డైరెక్ట్ చేయ‌నున్న త‌దుప‌రి చిత్రం కూడా రొమాంటిక్ డ్రామాగానే తెర‌కెక్క‌నుంద‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. ప్రీవియ‌స్ మూవీ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్`ని అక్కినేని బుల్లోడు అఖిల్ హీరోగా తీర్చిదిద్దిన భాస్క‌ర్.. కొత్త చిత్రాన్ని అఖిల్ అన్న‌, యువ‌సామ్రాట్ నాగ‌చైత‌న్య‌తో ప్లాన్ చేస్తున్నార‌ట‌. అంతేకాదు.. ఏకే ఎంట‌ర్టైన్మెంట్స్ ప‌తాకంపై అనిల్ సుంక‌ర ఈ సినిమాని ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌నున్నార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే నాగ‌చైత‌న్య‌, భాస్క‌ర్ కాంబినేష‌న్ పై క్లారిటీ రానున్న‌ది.

కాగా, చైతూ తాజా చిత్రం `థాంక్ యూ` జూలై 8న తెర‌పైకి వ‌స్తోంది. అలాగే, అత‌ని తొలి వెబ్ - సిరీస్ `దూత‌` చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఇంకోవైపు.. వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా, ప‌ర‌శురామ్ నిర్దేశ‌కత్వంలో ఓ మూవీ చేయ‌బోతున్నాడు ఈ అక్కినేని యంగ్ హీరో. సో.. చైతూ, భాస్క‌ర్ కాంబో వెంచ‌ర్ 2023 ద్వితీయార్ధంలో ప‌ట్టాలెక్కే అవ‌కాశ‌ముందంటున్నారు ఫిల్మ్ న‌గ‌ర్ జ‌నాలు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com