![]() |
![]() |

లెజెండరీ నటి మీనా కుమారి గురించి హిందీ చిత్రసీమలోనే కాదు, యావత్భారతానికీ తెలుసు. పాకీజా, బైజు బావ్రా, ఫూల్ ఔర్ పత్తర్... ఆమె చేసిన సినిమాల గురించి చెబుతూ పోవచ్చు. హిందీ చిత్ర పరిశ్రమలో ఆమె చేసిన కృషిని ప్రస్తావిస్తూ ఏస్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఓ సినిమా చేయనున్నారు. దీనికి ఆయనే డైరక్షన్ చేస్తున్నారు. కృతి సనన్ ఈ ఐకానిక్ పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ టి-సిరీస్ నిర్మిస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది ప్రాజెక్ట్. మహజబీన్ బానోగా జన్మించిన మీనా కుమారి మూడు దశాబ్దాల కెరీర్లో 90 చిత్రాలలో నటించారు.
బైజు బావ్రా, పరిణీత, సాహిబ్ బీబీ ఔర్ గులామ్, కాజల్‌లకు ఉత్తమ నటి విభాగంలో నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను ఈమె గెలుచుకున్నారు. బాలనటిగా ఆమె తొలిసారిగా నటించారు. మీనాకుమారి పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒన్ నేనొక్కడినేతో మూవీతో సౌత్‌లో అడుగుపెట్టిన కృతిసనన్, నార్త్ లో హీరోపంతి, రాబ్టా, మిమీ, ఆదిపురుష్ లాంటి సినిమాలతో తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ప్రస్తుతం కరీనాకపూర్ కాన్, టబుతో కలిసి ది క్రూ మూవీలో నటిస్తున్నారు కృతిసనన్. అది కాకుండా టైగర్ ష్రాఫ్‌తో కలిసి గణపత్ చాప్టర్ ఒన్లోనూ నటిస్తున్నారు. sఇప్పటిదాకా బయోపిక్‌లు చేసిన అనుభవం లేదు కృతిసనన్‌కి. అయితే చిన్నతనంలో మీనాకుమారి సినిమాలను చాలా చూసేదాన్నని అన్నారు కృతి.
![]() |
![]() |