![]() |
![]() |

దివంగత తార శ్రీదేవి తనయగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తనదైన సినిమాల్లో నటిస్తూ ఓ వైపు పెర్ఫామెన్స్ ఉన్న పాత్రలతో పాటు గ్లామరస్ రోల్స్‌కు కూడా ప్రాధాన్యమిస్తూ మంచి గుర్తింపునే దక్కించుకుంది. తాజాగా ఆమె నటించిన బవాల్ సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. అది కూడా నేరుగా ఓటీటీలోనే. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటించారు. నితీష్ తివారీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది. సినిమాకు నెటిజన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. దీనిపై జాన్వీ కపూర్ చాలా హ్యాపీగా ఫీలవుతుంది.
తన సంతోషాన్ని ఓ ఎమోషనల్ నోట్‌గా రాసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడది నెట్టింట వైరల్ అవుతుంది. "బవాల్ సినిమా మీ అందరికీ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని సందర్భాల్లో మన మనసు మాటను మనం పట్టించుకోం. అదే పెద్ద సమస్యగా మారుతుంది. కొన్ని విషయాల కోసం మనం పోరాటం చేయాల్సి ఉంటుంది. దాని వల్ల చాలా విషయాలను మనం కోల్పోవాల్సి వస్తుంది. చరిత్రలో కొన్ని విషయాలను పరిశీలించినప్పుడు ఈ జీవితం ఎంత క్షణికమైందో అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అయితే మనం కోల్పోయిన వాటి విలువ వాటిని పోగొట్టుకున్నప్పుడు కానీ తెలియదు. చివరకు ఆనందం విలువను గుర్తించి, మన చుట్టూ ఉన్న విషయాలకు విలువనివ్వటం ప్రారంభిస్తాం. `బవాల్` సినిమా చూసిన తర్వాత అందరూ ఇలాగే ఆలోచిస్తారని అనుకుంటున్నాను" అని ఎమోషనల్ మెసేజ్‌ను పోస్ట్ చేసింది జాన్వీ కపూర్. ఈ పోస్ట్‌పై నెటిజన్స్ పాజిటివ్‌గా రియాక్ట్ అవుతూ జాన్వీని అభినందిస్తున్నారు.

ఇప్పటి వరకు బాలీవుడ్ చిత్రాలకే పరిమితమైన జాన్వీ కపూర్ ఇప్పుడు ఎన్టీఆర్, కొరటాల శి వ కాంబినేషన్‌లో రూపొందుతోన్న `దేవర` సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదే ఆమె తొలి సౌత్ మూవీ. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది. ఆమె రోల్ ఎలా ఉండబోతుందోనని అందరిలోనూ క్యూరియాసిటీ ఉంది.
![]() |
![]() |